RBI: కొత్త రూ.20 నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన

ఈ నోటు వెనుక భాగంలో ఎల్లోరా గుహల చిత్రం ఉంటుంది.

Representative Image of Rs 20

భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) త్వరలోనే కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ శనివారం ఓ ప్రకటన చేసింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో ఈ కొత్త నోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఈ కొత్త రూ.20 నోట్ల డిజైన్ మహాత్మా గాంధీ (న్యూ) సిరీస్‌లోలాగే ఉంటాయి. కొత్త నోట్లు విడుదలయ్యాక కూడా.. గతంలో జారీ చేసిన అన్ని పాత రూ.20 నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయి. పాత రూ.20 నోట్లను మార్చుకునే అవసరం లేదు.

Also Read: “అవును.. నిజమే”.. రావల్పిండి నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత్‌ దాడులు చేసిందని అంగీకరించిన పాక్ ప్రధాని

ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో వస్తున్న రూ.20 నోట్ల కొలతలు 63 మి.మీ x 129 మి.మీగా ఉంటాయి. బేస్‌ కలర్ “గ్రీనిస్‌ ఎల్లో” ఉంటుంది.

ఈ నోటు వెనుక భాగంలో ఎల్లోరా గుహల చిత్రం ఉంటుంది. భారతదేశ జాతీయ వారసత్వాన్ని హైలైట్ చేసేలా దీన్ని ఉంచారు. ఇతర డిజైన్లు, ప్యాటర్న్స్‌ ఈ నోటు మెయిన్‌ కలర్‌కు మ్యాచ్‌ అయ్యేలా ఉన్నాయి.

ఆర్‌బీఐ చేసిన ప్రకటన ఇదే..