LPG Gas Cylinder Price: స్వల్ప ఊరట.. తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర మరోసారి తగ్గింది. శనివారం 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 25.5 తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయించాయి. అయితే.. డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

LPG Gas Cylinder Price: వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర మరోసారి తగ్గింది. చిరు వ్యాపారులు, హోటల్స్, టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్ల యాజమానులకు చమురు సంస్థలు ఊరట కల్పించాయి. ప్రతినెల ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను చమురు కంపెనీలు సవరిస్తుంటాయి. ఈ క్రమంలో శనివారం 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 25.5 తగ్గించింది. అయితే.. డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

5G Network: 5జీ సేవలు ఏఏ దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.. 5జీ‌ తో లాభాలేంటి? నష్టాలేంటి?

చమురు కంపెనీలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ. 25.5 తగ్గి రూ. 1859.5కి చేరుకుంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. కోల్‌కతాలో రూ.36.5 తగ్గి రూ.1,995కి చేరింది. ముంబైలో రూ.32.5 తగ్గి రూ. 1,811కి, చెన్నైలో రూ.35.5 తగ్గి రూ.2009.5కి చేరింది. మరోవైపు హైదరాబాద్ లో రూ. 36.50 తగ్గడంతో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ. 2099.5 నుంచి రూ. 2063కి చేరింది. ఏపీలోని విజయవాడలో రూ. 2,035.5, వైజాగ్ లో 1908.5కి సిలిండర్ ధర చేరింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ ఏడాది గరిష్ఠస్థాయికి చేరిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు గత జులై నుంచి తగ్గుతూ వస్తున్నాయి. జులై నెలలో రూ.135, ఆగస్టులో రూ.36 మేర తగ్గిన ధర సెప్టెంబర్‌ 1న మరో రూ.91.50 మేర తగ్గింది. తాజాగా రూ.25.5 కోత విధించాయి.

ట్రెండింగ్ వార్తలు