5G Network: 5జీ సేవలు ఏఏ దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.. 5జీ‌ తో లాభాలేంటి? నష్టాలేంటి?

మానవ జీవనంలో అనూహ్య మార్పులకు కారణమయ్యే 5జీ సేవలు భారత దేశంలో అందుబాటులో రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవలను శనివారం ప్రారంభించనున్నారు. అయితే, ఈ సేవలు తొలుత ఎంపిక చేసిన కొన్ని నగరాల్లోనే అందుబాటులోకి వస్తాయి.

5G Network: 5జీ సేవలు ఏఏ దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.. 5జీ‌ తో లాభాలేంటి? నష్టాలేంటి?

5G Network

5G Network: మానవ జీవనంలో అనూహ్య మార్పులకు కారణమయ్యే 5జీ సేవలు భారత దేశంలో అందుబాటులో రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవలను శనివారం ప్రారంభించనున్నాయి. అయితే, ఈ సేవలు తొలుత ఎంపిక చేసిన కొన్ని నగరాల్లోనే అందుబాటులోకి వస్తాయి. దేశంలో పూర్తిస్థాయిలో ఈ సేవలు అందుబాటులోకి రావాలంటే అనేక సంవత్సరాలు పడుతుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలోని అన్ని ప్రాంతాల్లో 5జీ సేవలను వేగంగా విస్తరించాలని భావిస్తోంది.

5G network in india

5G network in india

ప్రపంచ వ్యాప్తంగా 5జీ సేవలు చైనాలో 356 నగరాల్లో, అమెరికాలో 296, ఫిలిప్పీన్స్‌లో 98, దక్షిణ కొరియాలో 85 నగరాల్లో కొన్నేళ్ల కిందటే అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ఇటలీ, జర్మనీ, యూకే, స్పెయిన్, కెనడా, థాయిలాండ్, స్వీడన్, ఎస్టోనియా, ఫిలిప్పీన్స్, భూటాన్, కెన్యా.. ఇలా సుమారు 72 దేశాల్లోని 1947 నగరాల్లో ఈ 5జీ సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ప్రముఖ నెట్ వర్క్ టెస్టింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కంపెనీ VIAVI ఈ ఏడాది జనవరిలో ఓ నివేదికలో వెల్లడించింది.

5G network in india

5G network in india

5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న క్రమంలో.. 5జీ ఫోన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే 4జీ ఫోన్లను 5జీలోకి మార్చుకోవచ్చా? అనే సందేహం వ్యక్తమవుతుంది. 4జీ ఫోన్లను 5జీలోకి మార్చుకొనే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఫోన్‌లోని మోడెమ్, ప్రాసెసర్లను 5జీకి సరిపోయే వాటితో మార్చి, సాప్ట్‌వేర్‌ను కూడా మారిస్తే తప్ప అది కుదరదని పేర్కొంటున్నారు. ఇది చాలా ఖర్చుతో కూడకున్న పని.

5G network in india

5G network in india

పాత 4జీ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్‌ను అందుకుంటుంది. కానీ, హార్డ్‌వేర్, సాప్ట్‌వేర్ పరిమితుల వల్ల కొన్ని పోన్లు 5జీ సేవలను పూర్తిస్థాయిలో అందించలేక పోవచ్చు. మీ 4జీ ఫోన్ 5జీకి సరిపోతుందో లేదో సర్వీస్ ప్రొడైవర్ ను సంప్రదించి తెలుసుకోవచ్చు.

5G network in india

5G network in india

5జీ సేవలు అందుబాటులోకి రావటం వల్ల అనేక లాభాలున్నాయి. భవిష్యత్ లో బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం అవుతాయి. వ్యవసాయంలో సాంకేతికత విస్తరిస్తుంది. ఆన్‌లైన్ చదువుల్లో విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉంది. అదేవిధంగా హైస్పీడ్, డౌన్‌లోడ్ సమయంలో ఆలస్యం ఉండదు. ఎలాంటి అంతరాయాలు లేకుండా గేమ్ లూ ఆడుకోవచ్చు.

5G Network in India

5G Network in India

మరోవైపు 5జీ సేవల వల్ల నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. 5జీ సేవలతో డౌన్‌లోడ్ స్పీడ్ వేగంగా ఉన్నప్పటికీ.. అప్ లోడింగ్ స్పీడ్ తక్కువేనట. ఎక్కువ సార్లు ఛార్జింగ్ పెట్టడం వల్ల జీవితకాలం తగ్గొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. 5జీ సేవలు ఇప్పట్లో దేశంలోని ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 5జీ టవర్ల ఏర్పాటు భారీ ఖర్చుతో కూడకున్న వ్యవహారం. దేశంలో 5జీ సేవలు విస్తరించాలంటే చాలా కాలం పడుతుందని తెలుస్తోంది.