కొత్త స్కామ్ : జియో కస్టమర్లకు వార్నింగ్

రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్లను హెచ్చరించింది. ఓ లింక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. పొరపాటున కూడా లింక్ ని క్లిక్ చేయొద్దని కోరింది. లింక్ క్లిక్ చేస్తే డేటా

  • Publish Date - October 9, 2019 / 09:43 AM IST

రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్లను హెచ్చరించింది. ఓ లింక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. పొరపాటున కూడా లింక్ ని క్లిక్ చేయొద్దని కోరింది. లింక్ క్లిక్ చేస్తే డేటా

రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్లను హెచ్చరించింది. ఓ లింక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. పొరపాటున కూడా లింక్ ని క్లిక్ చేయొద్దని కోరింది. లింక్ క్లిక్ చేస్తే డేటా చోరీ అవడం ఖాయమని వార్నింగ్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. Reliance Jio పేరు మీద కొత్త స్కామ్ జరుగుతోంది. దీని గుర్తించిన రిలయన్స్ జియో సంస్థ వెంటనే అలర్ట్ అయ్యింది. తన వినియోగదారులను కూడా అప్రమత్తం చేసింది. అధికారికంగా ఓ హెచ్చరిక జారీ చేసింది. 

దేశవ్యాప్తంగా అనేకమంది రిలయన్స్ జియో యూజర్లకు ఒక SMS వస్తోంది. దాని సారాంశాన్ని గమనిస్తే ”Good News!! Jio is giving free 25GB Data Daily for 6 months. Download app and register to activate offer link: **tiny url**” అని మెసేజ్ లో ఉంది. దీన్ని చూసి చాలామంది నిజమే అనుకుని వెనకా ముందు ఆలోచన చేయకుండా క్లిక్ చేస్తున్నారు. అంతే అడ్డంగా మోసపోతున్నారు. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మన ప్రమేయం లేకుండానే My Prime అనే apk ఫైల్ ఫోన్ లోకి డౌన్ లోడ్ అవుతుంది. ఆ తర్వాత మన డేటా మొత్తం హ్యాక్ అవుతుంది. వ్యక్తిగత సమాచారం హ్యాకర్లకు చేరిపోతుంది.
 
ఉచితంగా మొబైల్ డేటా లభిస్తుందన్న ఆశతో.. చాలామంది తెలిసో తెలియకో ఫోన్ లో ఇన్ స్టాల్ చేస్తున్నారు. అలా చేస్తే వ్యక్తిగత సమాచారం దొంగలిస్తుంది. కేవలం ఇది మాత్రమే కాదు గూగుల్ ప్లే స్టోర్ లో రిలయన్స్ జియో యూజర్లకు అదనపు ప్రయోజనాలు అందిస్తాం అనే పేరుతో అనేక నకిలీ అప్లికేషన్లు చలామణి అవుతున్నాయి. అవి వినియోగదారులకు ఏమాత్రం అదనంగా ప్రయోజనాలు కల్పించకవు. పైగా యూజర్ల ఫోన్ లోకి డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత వారి వ్యక్తిగత సమాచారం హ్యాకర్లకు చేరవేస్తున్నట్లుగా తెలిసింది. సో.. నకిలీ అప్లికేషన్లు, నకిలీ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జియో హెచ్చరించింది.

ట్రెండింగ్ వార్తలు