Jio Platformsలోకి TPG, L Catterton 847 మిలియన్ డాలర్ల పెట్టుబడి

  • Published By: Subhan ,Published On : June 14, 2020 / 01:08 PM IST
Jio Platformsలోకి TPG, L Catterton 847 మిలియన్ డాలర్ల పెట్టుబడి

Updated On : June 14, 2020 / 1:08 PM IST

ఇండియన్ ఆయిల్-టెలికాం దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వాల్యూ రూ. 64.4 బిలియన్ కు పెరిగింది. జియో ప్లాట్ ఫాం డిజిటల్ యూనిట్ల మరో రెండు వాటాలను శనివారం అమ్మకం జరిపింది. 0.93 వాటాను  TPG 598 మిలియన్ డాలర్లకు,  L Catterton 0.39వాటాను 249 మిలియన్ డాలర్లకు అమ్మకాలు జరిపారు. 

ముఖేశ్ అంబానీ జియో వాటాల్లో ఫేస్ బుక్ తో పాటు కలిపి 22శాతం వాటాలు అమ్మేశారు. దీంతో 8వారాల్లోనే 13.72 బిలియన్ డాలర్లు దక్కించుకున్నారు. ‘దేశవ్యాప్తంగా చిన్నపాటి వ్యాపారాలకు, వినియోగదారులకు ఇదెంతో మంచి పరిణామం. విషమ పరిస్థితుల్లోనూ  క్వాలిటీగా ఉండే డిజిటల్ సర్వీసులు అందించగలం’ అని TPG కో CEO జిమ్ కౌల్టర్ అన్నారు. 

79బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తులకు TPG పెట్టుబడిదారులుగా ఉంది. అందులో యూబర్, Airbnb, spotifలల్లో వాటాలు దక్కించుకుంది. L Catterton ఫ్రెంచ్ లగ్జరీ గ్రూప్ అయిన LVMH, ఆర్నాల్ట్ గ్రూపులతో కలిసి వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తుంది. 

జియో ప్లాట్ ఫాంలు అయిన జియో ఇన్ఫోకామ్, మ్యూజిక్, వీడియో మింగ్ యాప్‌ల విలువే 67.87బిలియన్ డాలర్లు ఉంటుందని రిలయన్స్ చెప్పింది. 376 మిలియన్ యూజర్లతో జియో ఇన్ఫోకామ్ ఇండియాలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా ఎదిగింది. 2016లో మార్కెట్ లోకి అడుగుపెట్టిన జియో పలు రకాల ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను ఆకట్టుకుంది.