×
Ad

దేశంలో ఎవరికి వారు సొంతంగా ప్రార్థనా మందిరాలు కట్టుకోవచ్చా? చట్టాలు ఏం చెబుతున్నాయి?

ఎవరైనా తన సొంత భూమిలో సొంత డబ్బులతో గుడి కట్టించుకోవచ్చా? దీనికి చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏంటనే సందేహాలు ఉన్నాయి. వాటికి ఆన్సర్లను పరిశీలిస్తే...

  • Publish Date - November 1, 2025 / 03:07 PM IST

Kashibugga Stampede: కాశిబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాదం జరిగింది. కార్తీకమాసం ఏకాదశి రోజు వెంకన్నను దర్శించుకోవడానికి వెళ్లిన భక్తుల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మంది చనిపోయినట్టు సీఎం చంద్రబాబునాయుడు ధ్రువీకరించారు. మరో ఐదుగురికి సీరియస్ గా ఉంది. చాలా మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారానికి సుమారు 1500 నుంచి 2000 మంది భక్తులు మాత్రమే వచ్చే ఈ ఆలయంలో ఒకే రోజు ఏకంగా 25వేల మంది వరకు భక్తులు వచ్చారని తెలుస్తోంది. అందుకే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఆలయానికి సంబంధించిన సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

కాశిబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోనిది కాదు. ఓ వ్యక్తి తన సొంత స్థలంలో నిర్మించిన ఆలయం. హరి ముకుంద పాండా అనే వ్యక్తి ఒడిశా రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన సుమారు 12 ఏళ్ల క్రితం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్లారు. అక్కడ రద్దీ కారణంగా భక్తులు తోసుకుంటూ వెళ్లడం.. సిబ్బంది కూడా పదండి.. పదండి అంటూ భక్తులను వెనుక నుంచి తరుముతున్నట్టుగా చేయడంతో స్వామివారి దర్శనం సంతృప్తికరంగా జరగలేదు. దీంతో ఆయన మనస్తాపం చెందారు. తానే సొంతంగా తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఒక గుడి కట్టించి స్వామి దర్శనం రోజూ చేసుకోవాలని అనుకున్నారు. తనకు ఉన్న కొబ్బరి తోటలో 12 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆయన తల్లి స్వతహాగా వాస్తు పండితురాలు కావడంతో ఏ విగ్రహం ఎక్కడ పెట్టాలి? ఏ శిలలతో విగ్రహాలు చేయించాలనే విషయాల్లో ఆమె సాయం చేశారు. తన సొంత డబ్బులతో సుమారు రూ.10 కోట్ల ఖర్చు చేసి ఆలయాన్ని నిర్మించారు.

సొంతంగా గుళ్లు కట్టుకోవచ్చా?

కాశిబుగ్గ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో లేదని, ఓ ప్రైవేట్ వ్యక్తి కట్టించుకున్నాడని తెలిసిన తర్వాత చాలా మందిలో ఒక అనుమానం వస్తుంది. ఎవరైనా తన సొంత భూమిలో సొంత డబ్బులతో గుడి కట్టించుకోవచ్చా? దీనికి చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏంటనే సందేహాలు ఉన్నాయి. వాటికి ఆన్సర్లను పరిశీలిస్తే ఒక వ్యక్తి తన వ్యక్తిగత సొంత స్థలంలో మతపరమైన నిర్మాణాలను కట్టుకోవచ్చు. రాజ్యాంగంలోకి ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 దీనికి సంబంధించి రక్షణ కల్పిస్తుంది. దీనికి సంబంధించి గతంలో పలు కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అలహాబాద్ హైకోర్టు కూడా ఇలా ఓ వ్యక్తి తన సొంత స్థలంలో సొంత డబ్బుతో మతపరమైన నిర్మాణాలు కట్టుకోవచ్చని చెప్పింది. అయితే, అది ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు. ఇతరుల ఆరోగ్యానికి, మోరాలిటీకి హానికలిగించకూడదు. ఇతర మతస్తుల విశ్వాసాలను తూలనాడేలా ఉండకూడదు.

పబ్లిక్ ప్లేస్ లో ప్రార్థనా మందిరాలు కట్టొచ్చా?

పబ్లిక్ ప్లేస్ లో ఏ ప్రార్థనా మందిరాలు అయినా సరే కట్టడం నిషేధం. అంటే పార్కులు, రోడ్ల మీద ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు. పూర్తి ఆధీకృత అనుమతి పొందిన తర్వాత మాత్రం నిర్మాణాలు చేయొచ్చు.

పాటించాల్సిన ఇతర రూల్స్

మీ సొంత స్థలంలో సొంతంగా గుడి కట్టుకున్నా కూడా దానికి కచ్చితంగా అనుమతి తీసుకోవాలి. స్థానిక పోలీసులు, పంచాయతీ లేదా మున్సిపాలిటీ నుంచి, పోలీసుల నుంచి నిర్మాణానికి సంబంధించిన అనుమతులు పొందాలి. అలాగే, ఆ నిర్మాణంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యానికి సంబంధించి, ప్రాణ రక్షణకు సంబంధించిన కార్మిక శాఖ నిబంధనలు పాటించాలి.