Hang Clothes Balconies : మీ బాల్కనీల్లో బట్టలు ఆరేశారా? వెంటనే తీసేయండి.. పోలీసుల హెచ్చరిక!

మీ బిల్డింగ్ బాల్కనీల్లో బట్టలు ఆరేశారా? అయితే వెంటనే తీసేయండి.. పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. భవనాల్లో బాల్కానీల్లో బట్టలను ఆరేయొద్దని నివాసులకు సూచనలు చేశారు.

Residents Asked Not To Hang Clothes In Balconies In Lucknow

Hang Clothes Balconies : మీ బిల్డింగ్ బాల్కనీల్లో బట్టలు ఆరేశారా? అయితే వెంటనే తీసేయండి.. పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యేకించి ఆ ప్రాంతంలోనే భవనాల్లో బాల్కనీల్లో బట్టలను ఆరేయొద్దని అక్కడి నివాసులకు పోలీసులు సూచనలు చేస్తున్నారు. ఇంతకీ ఎక్కడో తెలుసా? యూపీ రాజధాని లక్నో.. ఎందుకంటే.. ప్రధానమంత్రి మూడు రోజులు లక్నోలో పర్యటించనున్నారు. ప్రత్యేకించి లక్నో గోమతి నాగర్ ఎక్స్ టెన్షన్ ప్రాంతంలో ఆల్ ఇండియా డీజీపీల కాన్ఫరెన్స్ జరుగనుంది. ఈ కాన్ఫరెన్స్ కు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో హైసెక్యూరిటీ దృష్ట్యా గోమతి నగర్ ఇన్స్‌పెక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆ ప్రాంత వాసులకు బాల్కానీల్లో బట్టలు ఆరేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకించి సరస్వతి అపార్ట్ మెంట్ వాసులకు ఈ సూచనలు చేశారు. ఈ అపార్ట్ మెంట్‌కు ఎదురుగానే సిగ్నేచర్ బిల్డింగ్ ఉంది. అక్కడే ఆల్ ఇండియా డీజీపీల కాన్ఫరెన్స్ జరుగనుంది.

శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు ఈ కాన్ఫరెన్స్ కు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. అందుకే సెక్యూరిటీ దృష్ట్యా భవనాల్లోని బాల్కానీల్లో బట్టలను ఆరేయొద్దని అపార్ట్ మెంట్ వాసులకు పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల సమయంలో ఎవరైనా కొత్తవారు అపార్ట్ మెంటుకు రావడం గమనిస్తే వెంటనే తమకు సమాచారం అందించాల్సిందిగా ఇన్ స్పెక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.

Read Also : Aryan Khan : ఆర్యన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవ్..బాంబే హైకోర్టు