Revoke Ban Chinese Apps : చైనా యాప్‌లపై బ్యాన్ విత్‌డ్రా ప్రతిపాదనేది లేదు : కేంద్రం క్లారిటీ!

భారతదేశంలో నిషేధించిన చైనా యాప్‌లపై నిషేధాన్ని వెనక్కు తీసుకునే ప్రతిపాదనేమి లేదని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. చైనా వందలాది యాప్‌లను కేంద్రం బ్యాన్ చేసింది.

Revoke Ban Chinese Apps : భారతదేశంలో నిషేధించిన చైనా యాప్‌లపై నిషేధాన్ని వెనక్కు తీసుకునే ప్రతిపాదనేమి లేదని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇప్పటికే చైనాకు చెందిన వందలాది యాప్‌లను కేంద్రం బ్యాన్ చేసింది. అయితే డ్రాగన్ చైనా యాప్ లపై నిషేధాన్ని ఎత్తివేసే ప్రతిపాదనకు సంబంధించి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పార్లమెంటులో సమగ్ర వివరణ ఇచ్చారు. బ్యాన్‌ ఉత్తర్వులను వెనక్కి తీసుకునే ప్రతిపాదనలు ఏవి మంత్రిత్వశాఖ వద్ద లేవని ఆయన స్పష్టం చేశారు.

దేశంలో గత ఏడాదిలో నిషేధించిన చైనా యాప్‌లను పునః ప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందా? అని పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి వైష్ణవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69A కింద అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో మేకింగ్ అప్లికేషన్ టిక్ టాక్ (TikTok) సహా దాదాపు 224 చైనీస్ అప్లికేషన్‌లను భారత ప్రభుత్వం 2020 ఏడాది నవంబర్‌లో నిషేధించింది. అందులో పబ్‌జీ మొబైల్‌ (Pubg Mobile), టిక్‌టాక్‌ (TikTok), వీబో, వీచాట్‌ (Vchat), అలీ ఎక్స్‌ప్రెస్‌ సహా వందలాది చైనీస్‌ యాప్‌లను కేంద్రం నిషేధించింది. అందులో 43 చైనాకు చెందిన 43 మొబైల్‌ యాప్‌లను బ్లాక్‌ లిస్ట్‌లో చేరుస్తూ ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69ఏ కింద ఆదేశాలు జారీ చేసింది.

భారత సౌర్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణ, భద్రతను దృష్టిలో పెట్టుకొని యాప్‌లను నిషేధిస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొబైల్, నాన్-మొబైల్ ఇంటర్నెట్ రెండింటిలోనూ ఉపయోగించే కొన్ని యాప్‌ల వినియోగాన్ని నిరోధించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ 29న భారత్‌ 59 యాప్‌లను బ్లాక్‌ చేసింది. సెప్టెంబర్‌ 2న ఐటీచట్టంలోని సెక్షన్‌ కింద 118 చైనీస్ యాప్‌లను బ్యాన్ చేసింది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వద్ద భారత సైన్యం, చైనీస్ PLA మధ్య సైనిక ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో సరిహద్దు ఉద్రిక్తతలకు దారితీయడంతో భారత్ చైనా యాప్‌లపై నిషేధం విధించింది. అప్పటినుంచి అనేక ఉన్నత స్థాయి చర్చలు జరిగినప్పటికీ ఇప్పటికీ పరిష్కారం కాలేదు.

Read Also : Domestic Violence India : భారత్‌లో కరోనా రెండో‌ వేవ్‌లో 3,582 గృహహింస కేసులు..!

ట్రెండింగ్ వార్తలు