Boxer Sells Parking Tickets : మహిళా బాక్సర్‌ దుస్థితి..కుటుంబం కోసం పార్కింగ్‌ టికెట్లను అమ్ముకుంటున్న పరిస్థితి

ఓపక్క టోక్యోలో ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించినవారికి ప్రశంసల వర్షం, భారీ నజరానాలకు దక్కుతుంటే మరోపక్క గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒకప్పుడు బాక్సింగ్ లో పంచ్ లు కురిపించిన యువ మహిళా బాక్సర్ వీధుల్లో నానా కష్టాలు పడుతోంది. పార్కింగ్ టిక్కెట్లు అమ్ముకోవాల్సిన దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

Boxer Sells Parking Tickets : మహిళా బాక్సర్‌ దుస్థితి..కుటుంబం కోసం పార్కింగ్‌ టికెట్లను అమ్ముకుంటున్న పరిస్థితి

Ritu A Young Boxer, Sells Parking Tickets In Chandigarh

Updated On : August 7, 2021 / 4:34 PM IST

Ritu a young boxer sells parking tickets : ఓపక్క టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. మరో పక్క కుటుంబం కోసం కుటుంబ సభ్యుల్ని పోషించుకోవటం కోసం పార్కింగ్ టిక్కెట్లు అమ్ముకుని జీవించాల్సిన దుస్థితిలో ఉంది యువ బాక్సర్. ఓ పక్క పతకాల పంట పండుతుంటే..మరోపక్క ఓ క్రీడాకారిణి పొట్ట నింపుకోవటానికి నడివీధిలో పార్కింగ్ టిక్కెట్టు అమ్ముకుంటోంది. ఓ పక్క పతకాలు సాధించినవారికి ప్రశంసల వర్షం, భారీ నజరానాలకు దక్కుతుంటే మరోపక్క గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒకప్పుడు బాక్సింగ్ లో పంచ్ లు కురిపించిన యువ మహిళా బాక్సర్ వీధుల్లో నానా కష్టాలు పడుతోంది.

ఒకప్పుడు జాతీయ స్థాయిలో పలు మ్యాచ్‌ ల్లో పాల్గొని ఆడి, గెలిచి పతకాలు సాధించిన ఛండీగఢ్ కు చెందిన రీతూ పార్కిగ్ టిక్కెట్లు అమ్ముకుంటోంది. పతకాలు సాధించినా నాకు ఎటువంటి ప్రోత్సాహకాలు, స్కాలర్‌షిప్‌లు రాలేదని తెలిపింది. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని బతికించుకోవటానికి..కుటుంబం ఆర్థిక అవసరాలకోసం తనకెంతో ఇష్టమైన క్రీడలను విడిచిపెట్టాల్సి వచ్చిందని వాపోయింది రీతూ. ఇప్పటికైనా ప్రభుత్వం సహాయం చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది రీతూ. తాను సాధించిన పతకాలు నాకు ఏరకంగా ఉపయోగపడటంలేదని వాపోయింది.

ఓ క్రీడాకారిణిగా రాణించాలని దేశం కోసం ఇంకా ఏదో చేయాలనుకుంటున్న తనకు కుటుంబ భారంతో ఏమీ చేయలేకపోతున్నానని విచారం వ్యక్తం చేసింది. నాలాంటి దుస్థితి ఏ క్రీడాకారులకు రాకూడదని తెలిపింది. నేను బాక్సర్ గా రాణించినప్పుడు నా కుటుంబం నాకు అండగా ఉంది. ఇప్పుడు కుటుంబ పరిస్థితి బాగాలేదు. కాబట్టి నేను కుటుంబం కోసం నిలబడాల్సి వచ్చింది. మా కడుపులు నిండాలన్నా..నా తండ్రిని నేను కాపాడుకోవాలన్నా నేను ఏదోక పని చేయక తప్పదనీ..అందుకే ఇలా పార్కింగ్ టిక్కెట్లు అమ్ముకుని జీవిస్తున్నామని తెలిపింది.

కాగా పతకాలు సాధించినవారికి కోట్ల రూపాయలు నజరానాలు..కార్లు,ఇళ్లు, ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వాలు..కొంతమంది వ్యాపారులు ప్రకటిస్తున్నారు. కానీ వన్నె తగ్గిపోతున్న క్రీడాకారుల్ని పట్టించుకునే నాథుడే ఉండటంలేదు. పతకాలు సాధించాక వారిని అందలాలు ఎక్కించే కంటే కష్టాల్లో ఉన్న క్రీడాకారులను ఆదుకుని వారిలో ఉండే ప్రతిభను కనుమరుగు కాకుండా దేశం కోసం ఉపయోగపడేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అలా క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి వారికి ముందునుంచీ ప్రోత్సహిస్తే..భారత్ కు సిల్వర్..కాంస్య పతకాలే కాదు బంగారు పతకాల పంట కూడా పండుతుందని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మన క్రీడాకారుల్లో అంతటి శక్తి ఉంది. అంతటి ప్రతిభా పాటవాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే చైనా, రష్యా, అమెరికా దేశాలతో పాటే కాదు పతకాల పంటలో భారత్ నంబర్ వన్ అవుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని గమనించాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు క్రీడాకారుల ప్రతిభల్ని గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.