Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, టెంపో ఢీకొని ఎనిమిది మంది చిన్నారులు సహా 11 మంది మృతి

రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కరౌలి- ధోల్‌పూర్‌ జాతీయ రహదారిపై సునిపూర్ గ్రామం సమీపంలో

Road Accident

Dholpur Road Accident: రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కరౌలి- ధోల్‌పూర్‌ జాతీయ రహదారిపై సునిపూర్ గ్రామం సమీపంలో స్లీపర్ కోచ్ బస్సు, టెంపో ఢీకొన్నాయి. ఈ ఘటనలో టెంపోలోని 11 మంది ప్రయాణికులు మరణించారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ముగ్గురు బాలికలు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది.

Also Read: Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు..!

టెంపోలో ప్రయాణిస్తున్న వారందరూ బారీ నగరంలోని గుమత్ మొహల్లా ప్రాంతానికి చెందిన వారు. వీరంతా బరౌలి గ్రామంలోని వారి బంధువుల ఇంటి వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు కూడా దెబ్బతింది. పోలీసులు బస్సును సీజ్ చేశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది ప్రయాణికులు టెంపోలో గాఢ నిద్రలో ఉన్నారు. స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగంతో వచ్చి ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.