SBI Mumbai: బ్యాంకులోకి చొరబడి కాల్పులు జరిపిన దొంగలు.. ఒకరు మృతి.. రూ. 2.5 లక్షలు చోరీ

వాణిజ్య రాజధాని ముంబైలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఎస్బీఐ బ్యాంకులోకి చొరబడిన ఇద్దరు ముసుగు దొంగలు ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై కాల్పులు జరపడంతో అక్కడిక్కకడే మృతి చెందాడు.

SBI Mumbai: బ్యాంకులోకి చొరబడి కాల్పులు జరిపిన దొంగలు.. ఒకరు మృతి.. రూ. 2.5 లక్షలు చోరీ

Sbi Mumbai

Updated On : December 30, 2021 / 7:40 AM IST

SBI Mumbai: వాణిజ్య రాజధాని ముంబైలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఎస్బీఐ బ్యాంకులోకి చొరబడిన ఇద్దరు ముసుగు దొంగలు ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై కాల్పులు జరపడంతో అక్కడిక్కకడే మృతి చెందాడు.. మిగతా ఉద్యోగులను బెదిరించి రూ.2.5 లక్షలు దోచుకెళ్లారు. ఈ ఘటన ముంబైలోని దహిసర్ వెస్ట్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో జరిగింది. బుధవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో ఇద్దరు ముసుగు దొంగలు బ్యాంకులోకి వచ్చారని బ్యాంకు ఉద్యోగుల్లో ఒకరు తెలిపారు.

చదవండి : Theft In Wedding : ఐపీఎస్ అధికారి పెళ్లిలో దొంగతనం

కౌంటర్‌లో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందేశ్ గోమరే వద్దకు వెళ్లి అతడి ఛాతీపై గన్ పెట్టి కాల్పులు జరిపినట్లు, ప్రత్యేక్ష సాక్షి తెలిపారు. అనంతరం బ్యాంకు మొత్తం తిరుగుతూ ఉద్యోగులను బెదిరించారని పేర్కొన్నారు. అనంతరం రూ.2.5 లక్షలు దోచుకెళ్లారని వివరించారు. ఈ దృశ్యాలన్నీ బ్యాంకు సీసీటీవీలో రికార్డు అయినట్లు తెలిపారు ప్రత్యేక్ష సాక్షి(బ్యాంకు ఉద్యోగి)

చదవండి : Fighter jet tyre Theft : ఏకంగా..యుద్ధ విమానం టైర్‌ను దొంగిలించిన దుండగులు

దోపిడీ గురించి పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. దొంగల కాల్పుల్లో మృతి చెందిన సందేశ్ గోమరే బాడీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజ్ పరిశీలించారు. దొంగల వయసు 25 నుంచి 30 మధ్య ఉండే అవకాశం ఉందని వారి కదలికలను బట్టి గుర్తించారు పోలీసులు. మొత్తం 8 టీమ్స్ దొంగల కోసం గాలింపు చేపట్టాయని ముంబై నార్త్ రీజియన్ అడిషనల్ సీపీ ప్రవింద్ పడ్వాల్ తెలిపారు.