Rosefinch Bird : హిమాలయాల్లో కొత్త పక్షిని కనుగొన్న సైంటిస్టులు

హిమాలయా పర్వతాల్లో శాస్త్రవేత్తలు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్ఎస్) శాస్త్రవేత్తలు తూర్పు హిమాలయాల్లో ఓ కొత్త పక్షిని కనుగొన్నారు. ఆ పక్షి పేరు రోజ్‌ఫించ్.

new bird found in himalayas : ప్రకృతిలో ఏది కొత్తగా కనిపించినా ఆనందంగానే ఉంటుంది. కొత్త జంతువుల్ని, కొత్త పక్షుల్ని కనుగొన్నప్పుడు శాస్త్రవేత్తలు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. అటువంటి సంతోషకరమైన విషయాన్ని తెలిపారు మన భారత శాస్త్రవేత్తలు. హిమాలయా పర్వతాల్లో శాస్త్రవేత్తలు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్ఎస్) శాస్త్రవేత్తలు తూర్పు హిమాలయాల్లో ఓ కొత్త పక్షిని కనుగొన్నారు. ఆ పక్షి పేరు రోజ్‌ఫించ్.

కొత్త పక్షిని కనుగొనటంతో భారత్ లో పక్షి జీవవైవిధ్యం సంఖ్య 1,340కి పెరిగింది. పిచ్చుకను పోలి ఉండే ఈ రోజ్‌ఫించ్ సముద్ర మట్టానికి 3,800 మీటర్ల ఎత్తున అరుణాచల్‌ప్రదేశ్‌లోని సెలా పాస్ శంఖాకార అడవుల్లో ఫిబ్రవరి 8న శాస్త్రవేత్తలకు కనిపించింది. దాన్ని చూడటంతోనే శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తంచేశారు.

దక్షిణ చైనాలో కనిపించే ఈ పక్షి భూటాన్‌లోనూ తిరుగుతుంటుంది. ఈ రోజ్ ఫించ్‌ పక్షులలో పలు జాతులు ఉన్నాయని..అవి శీతాకాలంలో నైరుతి చైనా నుంచి భారత్‌కు వలస వస్తుంటాయని అధ్యయనకర్త గిరీశ్ జాథర్ తెలిపారు. సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లలోని పది రకాల ఫించ్‌ పక్షులు ఉన్నాయని తెలిపారు. కానీ వాటి పూర్తి సంఖ్య గురించి ఇంకా అధ్యయనాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు