Royal Enfield Classic 350
Royal Enfield Classic 350 : రాయల్ ఎన్ఫీల్డ్ అంటే అందరికీ ఎంతో క్రేజ్. బుల్లెట్ బండిపై దూసుకెళ్లాలని, షికార్లు కొట్టాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. భారత్ సహా ప్రపంచ మార్కెట్ లో మోస్ట్ పాపులర్ మోటార్ సైకిల్ బ్రాండ్లలో క్రేజ్ ఉన్న మోటార్ సైకిల్ అంటే.. టక్కున గుర్తుచ్చేది.. రాయల్ ఎన్ ఫీల్డ్. ఈ బ్రాండ్ నుంచి ఎన్నో వెరైటీ మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్త బైక్ వస్తుందంటే అందరి చూపు ఆ మోటార్ సైకిల్ పైనే ఉంటుంది. తాజాగా మరో కొత్త మోడల్ ను కంపెనీ లాంచ్ చేసింది. అదే ఆల్ న్యూ క్లాసిక్ 350 మోడల్.
New PF Rule : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని చేయకపోతే నష్టపోతారు
క్లాసిక్ 350 డిజైన్, ఫీచర్స్..
* మెటియోర్ 350cc ఇంజిన్.
* 20.2 bhp, గరిష్టంగా 27ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
* 5 స్పీడ్ గేర్ బాక్స్
* మెటియోర్లోని జె ప్లాట్ ఫామ్‌ని ఇందులో కూడా అందించింది.
* దీనిలో బ్లూటూత్ సాయంతో స్మార్ట్ ఫోన్‌కి కనెక్ట్ అయ్యి నావిగేషన్‌ని చూపించే ట్రిప్పర్ టర్న్ టు టర్న్ నావిగేషన్‌ని చేర్చింది.
* అయితే ఇందులో ముందు మోడల్స్‌లో ఉన్న విధంగా కిక్ స్టార్టర్ లేదు.
Hyd Metro Sale : అమ్మకానికి హైదరాబాద్ మెట్రో.. వాటాలు విక్రయిస్తాం.. ఎల్అండ్‌టీ!
* 11 కలర్స్ లో అందుబాటులో
* ఇందులో 9 డ్యూయల్ ఛానల్ వేరియంట్లు, రెండు సింగిల్ ఛానల్ వేరియంట్లు
* అత్యాధునిక ఫీచర్స్
* రెట్రో స్టైల్ రౌండ్ టెయిల్ ల్యాంప్స్, రౌండ్ టర్న్ ఇండికేటర్స్ తో పాటు రిట్రో స్టైల్ హాలోజెన్ హెడ్ ల్యాంప్స్ కూడా ఉండడం విశేషం.
* మల్టీ స్పోక్ డ్యుయల్ టోన్ అల్లాయ్ వీల్స్
* టియర్ డ్రాప్ షేప్డ్ ఫ్యూయల్ ట్యాంక్
* సర్కులర్ టర్న్ ఇండికేటర్స్
* రేర్ వ్యూ మిర్రర్స్
3 వేరియంట్లలో విడుదల
* సింగిల్ సీటర్ క్లాసిక్ 350
* ట్విన్ సీటర్ క్లాసిక్ 350
* క్లాసిక్ 350 సింగిల్ ఎడిషన్ వేరియంట్
న్యూ క్లాసిస్ 350 ప్రారంభ ధర రూ.1.84లక్షలు(Redditch Series).
Classic 350 Halcyon రేంజ్ ధర రూ.1.93 లక్షలు
2021 Royal Enfield Classic 350 Signals ధర రూ.2.04 లక్షలు
New Classic Dark Edition ధర రూ.2.11 లక్షలు
Top of the line Chrome Classic 350 ధర రూ.2.15 లక్షలు
Life Expectancy : వాయుకాలుష్యంతో భారతీయుల ఆయుర్దాయం 9 ఏళ్లు తగ్గిపోవచ్చు!
బ్రిటన్ సంస్థ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ తొలి బైక్ ను 1901లో తయారు చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ సైన్యం ఈ బైక్‌లను ఎక్కువగా వాడడంతో ఆ తర్వాత మరింత క్రేజ్ వచ్చింది. అప్పట్లో కేఆర్ సుందరం అయ్యర్ యజమానిగా ఉన్న మద్రాసు మోటార్స్ లిమిటెడ్ ద్వారా తొలుత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు భారత్‌లో ప్రవేశించాయి. ఆయన అల్లుడు ఈశ్వరన్ సైతం ఎన్ఫీల్డ్ బైక్‌లను దిగుమతి చేసుకునేవారు. రాలేగ్, రుడ్జ్, హంబర్, బీఎస్ఏ, ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లను సుందరం, ఈశ్వన్ విక్రయించేవారు.