ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన RPF సిబ్బంది

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఓ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన అహ్మదాబాద్ రైల్వేస్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది.

  • Publish Date - September 25, 2019 / 08:08 AM IST

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఓ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన అహ్మదాబాద్ రైల్వేస్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఓ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన అహ్మదాబాద్ రైల్వేస్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆశ్రమ్ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కేందుకు వస్తుండగా.. అప్పటికే ఆ రైలు కదిలింది. కదులుతున్న రైలును ఎక్కబోయిన ఆ యువకుడు ప్లాట్‌ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుపోయాడు.

ఆ యువకుడిని గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమై అతడిని కోచ్‌లోకి తోసేశారు. ప్రయాణికుడికి తీవ్ర గాయాలైనప్పటికీ అతడి ప్రాణాలను కాపాడారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే ప్రయాణికులు కదులుతున్న రైలును ఎక్కొద్దని సూచిస్తూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆ వీడియోను తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేసింది.