Rahul Gandhi : రాహుల్ గాంధీకి రూ. 1500 చెల్లించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త
మహారాష్ట్రలోని భివండికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేశ్ కుంటే...స్థానిక కోర్టులో పరువు నష్టం దాఖలు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ.. మంబాయి హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును..

Rahul And RSS
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆర్ఎస్ఎస్ కు చెందిన ఓ కార్యకర్త రూ. 1500 పంపించారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు ఆయనకు ఎందుకా ఆ డబ్బు పంపించారా ? అని సెర్చ్ చేస్తున్నారు. మనీ ఆర్డర్ ద్వారా రాహుల్ గాంధీ కార్యాలయానికి పంపించారు. ఈ మనీ ఆర్డర్ అందుకున్నట్లు రాహుల్ కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని ఆర్ఎస్ఎస్ కార్యకర్తకు చెందిన న్యాయవాది వెల్లడించారు. మహాత్మాగాంధీని RSS హత్య చేసిందంటూ 2014లో మార్చిలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారంటూ..
Read More : Harish Rao On Rahul Gandhi : ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం-రాహల్ గాంధీపై తీవ్ర విమర్శలు
మహారాష్ట్రలోని భివండికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేశ్ కుంటే…స్థానిక కోర్టులో పరువు నష్టం దాఖలు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ.. మంబాయి హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును రాహుల్ తరపు న్యాయవాది నారాయణ్ అయ్యర్ ఆశ్రయించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతోంది. దీనికి రాహుల్ తరపు అడ్వకేట్ నారాయణ్ అయ్యర్ హాజరయ్యారు. అయితే.. విచారణ వాయిదా వేయాలంటూ రాజేశ్ కుంటే తరపు న్యాయవాది కోర్టును కోరడంపై రాహుల్ న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదుదారుడు గతంలో కూడా ఇలాగే కోరారని.. దీనికి కోర్టు రూ. 500 జరిమాన విధించిందని కోర్టుకు తెలిపారు.
Read More : Rahul Gandhi: పీకే నిర్ణయాన్ని రాహుల్ ముందే ఊహించారా?
రెండోసారి వాయిదా కోరిన పిటిషనర్ రాజేశ్ కు కోర్టు రూ. 1000 జరిమాన విధించింది. పాత ఫైన్ తో కలిపి మొత్తం రూ. 1, 500 రాహుల్ గాంధీకి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాలతో రూ. 1500 ని మనీ ఆర్డర్ ద్వారా రాహుల్ కార్యాలయానికి పంపినట్లు రాజేశ్ తరపు న్యాయవాది తెలిపారు. ఆ డబ్బును అందుకున్నట్లు రాహుల్ కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని న్యాయవాది నారాయణ్ అయ్యర్ తెలిపారు.