Vaishno Devi Temple : వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాలంటే ఇకపై అది తప్పనిసరి

కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"భయాందోళనల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని శ్రీ మాతా వైష్లోదేవి దేవస్థానం(SMVDSB)కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని సందర్శదించే భక్తులందరూ

Vaishno Devi Temple :  కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”భయాందోళనల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని శ్రీ మాతా వైష్లోదేవి దేవస్థానం బోర్డు(SMVDSB)కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని సందర్శించే భక్తులందరూ 72 గంటల్లోపు తీసుకున్న కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా చూపించాల్సిందేనని దేవస్థానం బోర్డు సీఈవో రమేశ్‌కుమార్‌ తెలిపారు.

అయితే నెగెటివ్‌ సర్టిఫికెట్‌ లేకుండా వచ్చిన వారికి స్థానికంగానే పరీక్షలు చేయించనున్నట్లు చెప్పారు. రిపోర్ట్‌ ఆధారంగానే ఆలయ ప్రవేశానికి అనుమతి ఉంటుందని చెప్పారు. భక్తులందరూ తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరారు.

ఫేస్ మాస్క్ లు కూడా తప్పనిసరి అని,ఆలయ ఎంట్రీ పాయింట్స్ దగ్గర భక్తలుకు బాడీ టెంపరేచర్ చెక్ చేసే ఏర్పాట్లు ఇప్పటికే చేయబడ్డాయని SMVDSB ప్రతినిధి తెలిపారు. ఇక,సోషల్ డిస్టెన్స్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని అన్నారు. కరోనావైరస్ నేపథ్యంలో భక్తుల సేఫ్టీ దృష్ట్యా దేవస్థానం బోర్డు ఆలయ ప్రాంగణాలను కోవిడ్ గైడ్ లైన్స్,ప్రొటోకాల్స్ కి అనుగుణంగా ప్రతి రోజూ శానిటైజ్ చేస్తోంది.

కాగా,రేశాయ్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో ఉన్న వైష్ణోదేవి ఆలయాన్ని ప్రతిరోజూ దేశవిదేశాల నుంచి వేలా మంది భక్తులు సందర్శిస్తుంటారు.

ALSO READ Leftover Food To The Needy : పెళ్లిలో మిగిలిపోయిన ఫుడ్ ని పేదలకు పంచిన మహిళ

ట్రెండింగ్ వార్తలు