Site icon 10TV Telugu

Rupee Fell: అత్యంత కనిష్టానికి రూపాయి.. డాలరుతో 83కు చేరువలో భారత కరెన్సీ

Rupee Fell

Rupee Fell: రూపాయి విలువ వరుసగా దిగజారుతోంది. బుధవారం డాలరుతో రూపాయి విలువ 82.90కి చేరింది. ఒక దశలో ఇంట్రాడేలో లైఫ్‌టైమ్ కనిష్టానికి అంటే 83.02కు చేరింది. తర్వాత 0.76 శాతం తగ్గి, 82.99 దగ్గర క్లోజైంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం డాలర్ విలువ 83కు చేరే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.

Delhi Woman: మహిళను ఎత్తుకెళ్లి ఐదుగురి సామూహిక అత్యాచారం.. ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన

ఇంతకుముందు సెషన్లో రూపాయి విలువ 82.36గా ఉంది. ఈ రోజు మరింత తగ్గింది. ఈ ఏడాది డాలరుతో పోలిస్తే రూపాయి విలువ దాదాపు 10 శాతం తగ్గింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ పడిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆహారోత్పత్తుల ధరలు పెరగడం, బ్రిటీష్ ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టానికి (10.1 శాతం) చేరడంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లు పెంచింది. అమెరికాలో ఫెడరల్ బ్యాంకు వరుసగా వడ్డీ రేట్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. వీటన్నింటి ప్రభావంతో డాలరు విలువ పడిపోతోంది.

Solar Eclipse: ఈ నగరాల్లోనే సూర్యగ్రహణం.. హైదరాబాద్‌లో కనిపిస్తుందా? ఈసారి మిస్సైతే మళ్లీ పదేళ్ల తర్వాతే!

అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నంత కాలం మన రూపాయి పతనం ఇలాగే కొనసాగుతుందని విశ్లేషకులు అంటున్నారు. దేశంలో రూపాయి విలువ పతనంపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని విమర్శిస్తున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. రూపాయి విలువ తగ్గడం లేదని.. డాలరు విలువే పెరుగుతోందని ఆమె అన్నారు.

 

Exit mobile version