×
Ad

india-Russia : వైద్య పరికరాలు అందించాలంటూ భారత్ సహాయం కోరిన రష్యా..

వైద్య పరికరాలు అందించాలంటూ రష్యా భారత్ సహాయం కోరింది.

  • Published On : April 20, 2022 / 11:11 AM IST

India Russia Seeks Medical Equipment From India As War Disrupts Trade

india-Russia : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. అయినా భారత్ మాత్రం రష్యాతో దోస్తీ వీడనంటోంది. రష్యాకు అసవరం అయితే సహాయం చేస్తానంటోంది. అన్నట్లుగా రష్యా కోరిన సహాయం అందించటానికి భారత్ రెడీ అయ్యింది. ఏంటా సహాయం అనుకుంటున్నారా? రష్యా భారత్ నుంచి వైద్య పరికరాలుకావాలని కోరింది. దీనిపై ఇరు దేశాల మధ్యా చర్చలు జరుగుతున్నాయి.

Also read : Russia vs ukraine war: పుతిన్.. మరీ ఇంత క్రూరత్వమా.. రష్యాను వ్యతిరేకించే దేశాలకు మరో షాకిచ్చిన పుతిన్..

యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తుండటంతో యూరోప్‌ దేశాలతోపాటు చైనా నుంచి కూడా రష్యాకు దిగుమతులు చాలావరకు తగ్గిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో పుతిన్‌ ప్రభుత్వం భారత్‌ సాయం కోరుతోంది. మరిన్ని వైద్య పరికరాలు అందించాలని కోరింది. ఈ అంశంపై ఇరు దేశాలు చర్చలు జరపనున్నాయి. ఇరు దేశాలకు చెందిన మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ కంపెనీలు ఈ నెల 22వ తేదీన వర్చువల్‌గా సమావేశం కానున్నాయి. వైద్య సామగ్రి సరఫరాలను పెంచే మార్గాలపై చర్చించనున్నట్లు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ ఫోరమ్ కోఆర్డినేటర్ రాజీవ్ నాథ్ తెలిపారు. ఈ విషయాన్ని రష్యా వాణిజ్య వర్గసంఘం ధ్రువీకరించింది.

Also read: Russia – India: రష్యాకు ఎగుమతులు పునరుద్ధరించిన భారత్: ఇరు దేశాల కరెన్సీతోనే చెల్లింపులు

రష్యాపై పాశ్చాత్య దేశాల కఠిన ఆంక్షలు కొనసాగుతున్న వేళ.. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కొనసాగిన తరహాలో ద్వైపాక్షిక వాణిజ్యం కోసం ఇరు దేశాలు స్థానిక కరెన్సీల్లో (రూపాయి-రూబుల్‌) చెల్లింపులపై కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో రష్యాకు ఎగుమతుల్ని పెంచే విషయంపై భారత్‌ సమాలోచనలు జరుపుతోంది. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాను ఏకాకిని చేయాలని అమెరికా దాని మిత్రపక్షాలు భావిస్తున్నాయి.