Vladimir Putin : భారత్ గడ్డపై అడుగుపెట్టిన వ్లాదిమిర్ పుతిన్.. ఘన స్వాగతం.. ప్రపంచం చూపు ఇండియా వైపు..!
Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ చేరుకున్నారు. భారత్ లో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంతోపాటు.. ప్రధాని మోదీతో భేటీ అవుతారు.
Vladimir Putin
Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ చేరుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్న ఆయనకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు.
Also Read : Nanded Accident: మహారాష్ట్రలో భయంకర రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన టాటా మ్యాజిక్.. 9 మంది దుర్మరణం!
భారత దేశం 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహిస్తోంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు. అయితే, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఢిల్లీ పర్యటనకు అంతర్జాతీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. ఎందుకంటే.. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తరువాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన స్వయంగా హాజరుకావడం ఇదే తొలిసారి.
భారత్ పర్యటనలో భాగంగా బ్రిక్స్ సదస్సులో పాల్గోనున్న పుతిన్.. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రక్షణ, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. మోదీ-పుతిన్ సమావేశంలో రక్షణ సహకారం, ఇంధన భద్రత, సాంకేతిక రంగం, వాణిజ్యం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ ఆధునికీకరణపై ఇరు దేశాలు చర్చిస్తున్నట్లు సమాచారం. రష్యా నుంచి భారత్కు మిగిలిన ఎస్-400 వ్యవస్థల సరఫరా, రష్యా తయారీ Su-57 యుద్ధ విమానాల ప్రతిపాదనపైనా చర్చలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా.. భారత్లో కొత్త పౌర అణు రియాక్టర్ల ఏర్పాటు అంశంపైనా రష్యాతో చర్చలు జరగనున్నట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. దీంతో మోదీ-పుతిన్ భేటీపై రక్షణ, ఇంధనం, వ్యూహాత్మక రంగాలు ప్రధానంగా దృష్టి సారించాయి.
President Putin arrives in New Delhi:
Government Il-96 landed at the base of the air force of the Republic of Palam.
(3:54 am, Delhi time)
NEW DELHI, September 11. /TASS/. Russian President Vladimir Putin arrived in India, in the capital of which New Delhi the BRICS summit… https://t.co/K9ZBz6ZsHk pic.twitter.com/tnM4Q7pHIM
— ⏳Towhee 🌏☮️ (@amborin) September 10, 2026
మరోవైపు.. మోదీ, పుతిన్ గత వారం కిర్గిజ్స్తాన్లోని బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించిన మోదీ.. అంతులేని యుద్ధం నుంచి యుద్ధం ముగిసే దిశగా వెళ్లాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా భేటీలోనూ ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ శాంతి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా భారత్ పర్యటనకు రానున్నారు. మోదీ-జిన్పింగ్ భేటీ శనివారం జరగనుండగా.. వాణిజ్యం, పెట్టుబడులు, వాస్తవాధీన రేఖ (LAC) వద్ద పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తోనూ మోదీ శుక్రవారం సమావేశం కానున్నారు.
