శబరిమల వివాదం..సుప్రీంలో వాదనలు

  • Publish Date - January 13, 2020 / 01:04 AM IST

శబరిమల వివాదంపై సుప్రీంకోర్టు వాదనలు విననుంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలంటూ ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం 2020, జనవరి 13వ తేదీ సోమవారం వాదనలు విననుంది.

శబరిమలతో పాటు దర్గాలు, మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, ఇతర మతస్థుల్ని పెళ్లాడే పార్సీ మహిళకు మతపరమైన ప్రాంగణాల్లోకి ప్రవేశం లేకపోవడం వంటి అంశాలపైనా విచారణ జరపనుంది.  శబరిమల ఆలయంలోకి అన్ని వయసులు గల మహిళలు వెళ్లవచ్చని సుప్రీం కోర్టు 2018 సెప్టెంబర్ 28న తీర్పునిచ్చింది. 

* ఈ తీర్పుపై 60 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. 
* 2019 నవంబర్ 14వ తేదీన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. 
 

* మహిళల ప్రవేశంపై దాఖలైన కేసులను విచారించిన న్యాయమూర్తులు. 
* మహిళల ప్రవేశంపై న్యాయస్థానం ఎంతవరకు కలుగజేసుకునే అవకాశం ఉందనే అంశంపై రాజ్యాంగ ధర్మాసనం సమీక్షించనుంది. 

Read More : త్వరలోనే JBS To MGBS Metro Rail

ట్రెండింగ్ వార్తలు