Sabarmati Express : సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి కుట్ర జరిగిందా..? తృటిలో తప్పిన పెను ప్రమాదం

యూపీలోని కార్పూర్ లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ (వారణాసి - అహ్మదాబాద్) శుక్రవారం రాత్రి 2.30 గంటల సమయంలో పట్టాలు తప్పింది. రైలుకు చెందిన 22 కోచ్ లు

Sabarmati Express

Sabarmati Express Train Derail : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కార్పూర్ లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ (వారణాసి – అహ్మదాబాద్) శుక్రవారం రాత్రి 2.30 గంటల సమయంలో పట్టాలు తప్పింది. రైలుకు చెందిన 22 కోచ్ లు పట్టాలు తప్పాయి. అయితే, ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఈ రైలు ప్రమాదం వెనుక కుట్రకోణం దాగిఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం సమయంలో రైల్వే ట్రాక్ పై ఉంచిన పెద్ద బండరాయిని రైలు ఢీకొట్టింది. ఈ కారణంగానే రైలు పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఇంటిలెజెన్స్ బ్యూరో (ఐబీ) విచారణ జరుపుతోంది. యూపీ పోలీస్, రైల్వే శాఖ అధికారులుకూడా రైలు ప్రమాదం ఘటనపై విచారణ జరుపుతున్నారు.

Also Read : ఏపీలో వరుస కేసులు.. ఒకరి తర్వాత ఒకరు.. నెక్ట్స్‌ లిస్ట్‌లో వచ్చే పేరు ఎవరిదో?

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణ ప్రకారం.. రైల్వే ట్రాక్ లో ఎలాంటి పగుళ్లు లేవని తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన ఆధారాలు లభించాయని సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో రైల్వే మంత్రి తెలిపారు. ఐబీ, యూపీ పోలీసులు కూడా కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, ఉద్యోగులకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. రైలు ప్రమాదంపై లోకోపైలెట్ చెప్పిన ప్రకారం.. ప్రాథమికంగా చెప్పాలంటే బండరాయి రైలు ఇంజిన్ కు తగలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

Also Read : Kolkata Doctor Case : కోల్‌కతాలో పీజీ వైద్యురాలి ఘటన.. తెలుగు రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్

రైలు ప్రమాద విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. రైలులో ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తకుండా వారు గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ రైలుమార్గంలో పలు రైళ్లను రద్దుగా చేయగా.. మరికొన్ని రైళ్లను రూట్ మళ్లించారు.

 

ట్రెండింగ్ వార్తలు