Sachin Tendulkar Corona : కరోనాతో ఆస్పత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్‌

ఇటీవలే కరోనా బారిన పడ్డ...సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో పాటు..ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల సలహా మేరకు తాను ఆస్పత్రిలో చేరుతున్నట్టు సచిన్ ప్రకటించాడు.

Sachin Tendulkar Admitted To Hospital With Corona

Sachin Tendulkar admitted to hospital with Corona : ఇటీవలే కరోనా బారిన పడ్డ…సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో పాటు..ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల సలహా మేరకు తాను ఆస్పత్రిలో చేరుతున్నట్టు సచిన్ ప్రకటించాడు. త్వరలోనే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానని సచిన్ ట్వీట్ చేశాడు. మార్చి 27న సచిన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణయ్యింది. అప్పటి నుంచి ఆయన ఐసొలేషన్‌లో ఉన్నారు.

భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్ ప్రకంపనలు రేపుతోంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజులోనే 81 వేల 466 కేసులు నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్‌ 2 తర్వాత దేశంలో ఇంత భారీస్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. అంటే 182 రోజుల తర్వాత ఈ రేంజ్‌లో కేసులో రికార్డయ్యాయి. కరోనాతో 469 మంది చనిపోయారు. 117రోజుల తర్వాత అత్యధిక మరణాలు నమోదుకావడం ఇదే మొదటిసారి.

ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 6 లక్షలు దాటేసింది. నాలుగు రోజుల ముందు 5లక్షలగా ఉన్న పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇప్పుడు 6లక్షలు దాటింది. అంటే కేవలం నాలుగు రోజుల్లోనే లక్ష కంటే ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌ నాటి పరిస్థితులు దేశంలో మళ్లీ కనిపిస్తున్నాయి. భారీగా పెరుగుతున్న కరోనా కేసులు గతాన్ని గుర్తు చేస్తూ భయపెడుతున్నాయి. ఇక మరణాలు కూడా గతేడాది అక్టోబర్‌ రికార్డ్‌లను బ్రెక్‌ చేసేలా కనిపిస్తున్నాయి.