సచిన్ పుట్టిన రోజు : అభిమానులతో సరదాలు

  • Publish Date - April 24, 2019 / 09:18 AM IST

ముంబయి: భారత క్రికెట్ దిగ్గజం..మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ రోజు పుట్టిన రోజు. 1973 ఏప్రిల్ 24న మహారాష్ట్రలోని ఓ సాధారణ కుటుంబంలో సచిన్ జన్మించిన సచిన్ క్రికెట్ రంగంలో ఓ సంచలనం. ఓ అద్భుతం. ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న సచిన్ 47వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సచిన్ అభిమానులు, మాజీ క్రికెటర్లు, రాజకీయ, సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. 
Also Read : ఆయనకు ముద్దు పెడతావా : ధోనీ భార్యపై నెటిజన్లు ఫైర్

సచిన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ముంబయిలోని తన నివాసానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇంటి వద్దకు వచ్చిన అభిమానులతో సచిన్ కొంతసేపు సరదాగా మాట్లాడారు. దాంతో వారంతా ఆనందం వ్యక్తంచేశారు. అభిమానులు అభినందనలు సచిన్ అందుకున్న సచిన్ ఫ్యాన్స్‌కు అభివాదం చేసారు. టెండూల్కర్ కొంతమందిని ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా అభిమానులు సచిన్ తో సెల్ఫీలు దిగారు.