Sajan Prakash : చరిత్ర సృష్టించిన భారత స్విమ్మర్.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత

భారత స్విమ్మర్‌ సజన్‌ ప్రకాశ్‌ చరిత్ర సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అర్హత ‘ఎ’ ప్రమాణం అందుకుని ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత తొలి స్విమ్మర్‌గా

Sajan Prakash : చరిత్ర సృష్టించిన భారత స్విమ్మర్.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత

Sajan Prakash

Updated On : June 27, 2021 / 8:40 AM IST

Sajan Prakash : భారత స్విమ్మర్‌ సజన్‌ ప్రకాశ్‌ చరిత్ర సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అర్హత ‘ఎ’ ప్రమాణం అందుకుని ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత తొలి స్విమ్మర్‌గా సజన్ ప్రకాశ్ రికార్డు సృష్టించాడు. రోమ్‌లో సెట్‌ కోలి ట్రోఫీలో జరిగిన 200 మీటర్ల బటర్‌ ఫ్లై విభాగంలో అతడు ఒక నిమిషం 56.38 సెకన్లలో రేసు ముగించాడు. ఒలింపిక్‌ అర్హత మార్క్‌ ఒక నిమిషం 56.48 సెకన్లు. అంత కంటే ముందే లక్ష్యాన్ని చేరుకున్నాడు.

ఈ క్రమంలో కేరళకు చెందిన సజన్ ప్రకాశ్.. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డునూ తిరగరాశాడు. గత వారం బెల్‌గ్రేడ్‌ ట్రోఫీ స్విమ్మింగ్‌ టోర్నీలో ఒక నిమిషం 56.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరి జాతీయ రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 27ఏళ్ల సజన్‌కిది వరుసగా రెండో ఒలింపిక్స్‌ కానుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో సజన్‌ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో ఓవరాల్‌గా 28వ స్థానంలో నిలిచాడు.