మోడీపై పోటీకి దిగిన జవాన్ నామినేషన్ తిరస్కరణ

గతేడాది సైనికులకు సరఫరా చేసే ఫుడ్ క్వాలిటీపై వీడియో రిలీజ్ చేసి సర్వీసు నుంచి డిస్మిస్ అయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ ప్రతాప్ యాదవ్ ను సమాజ్ వాదీ పార్టీ వారణాశి లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే వారణాశి స్థానానికి ఎస్పీ అభ్యర్థిగా తేజ్ బహదూర్ వేసిన నామినేషన్ బుధవారం(మే-1,2019) తిరస్కరణకు గురైంది.
Also Read : వెనుజ్వేలాలో టెన్షన్ టెన్షన్.. ఆందోళనకారులపైకి మిలటరీ వాహనాలు

నామినేషన్ తిరస్కరణపై తేజ్ బహదూర్ మాట్లాడుతూ…ఉదయం 11గంటల లోపల సమర్పించాలన్న ఆధారాలను సమర్పించకపోవడం వల్లే నామినేషన్ తిరస్కరించామని అధికారులు చెప్పారు.అయితే మేము ఆధారాలు సమర్పించడం జరిగింది.అయినప్పటికీ నామినేషన్ తిరస్కరణపై తాము సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తామని తేజ్ బహదూర్ తెలిపారు.సమర్పించాలని అడిగిన డాక్యుమెంట్స్ సమర్పించామని,అయినప్పటికీ నామినేషన్ చెల్లదంటూ ప్రకటించారని దీనిపై సుప్రీంని ఆశ్రయిస్తామని తేజ్ బహదూర్ లాయర్ రాజేష్ గుప్తా తెలిపారు.

ఎవరైనా వ్యక్తి గత ఐదేళ్లలో రాష్ట్రప్రభుత్వ లేదా కేంద్రప్రభుత్వ సర్వీసుల నుంచి తొలగించబడినపుడు..ఆ వ్యక్తి అవినీతికి పాల్పడటం, విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల ఉద్యోగం నుంచి తొలగించబడలేదనే విషయాన్ని ధృవీకరిస్తూ ఈసీ సర్టిఫికెట్ జారీచేస్తుందని, అయితే ఆ సర్టిఫికెట్‌ను తేజ్‌బహదూర్ యాదవ్ మంగళవారం ఉదయం 11 గంటలలోపు సమర్పించలేదని, అందుకే ఆయన నామినేషన్‌ను తిరస్కరించామని వారణాసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు.

వారణాశి లోక్ సభ స్థానం నుంచి మరోసారి ప్రధాని మోడీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.కాంగ్రెస్ నుంచి మరోసారి అజయ్ రాయ్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.ఎస్పీ-బీఎస్పీ కూటమి మొదట ఈ స్థానానికి  అభ్యర్థిగా షాలిని యాదవ్ ను ప్రకటించగా ఆమె నామినేషన్ కూడా వేశారు.అయితే కొన్ని రాజకీయ కారణాలతో అభ్యర్థిని మారుస్తున్నట్లు ఎస్పీ-బీఎస్పీ కూటమి ప్రకటించింది.వారణాశి స్థానానికి అభ్యర్థిగా తేజ్ ప్రతాప్ బహదూర్ ను పోటీ చేయనున్నట్లు కూటమి ప్రకటించింది.
Also Read : మానవ జాతికి రక్షణగా : ఏలియన్స్.. మనతో రహస్యంగా జీవిస్తున్నాయి!