వెనుజ్వేలాలో టెన్షన్ టెన్షన్..ఆందోళనకారులపైకి మిలటరీ వాహనాలు

వెనుజ్వేలాలో టెన్షన్ కొనసాగుతోంది.బుధవారం కూడా పెద్ద ఎత్తున తన మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనల్లో పాల్గొనాలని ప్రతిపక్ష నాయకుడు జువాస్ గ్యాయిడో పిలుపునిచ్చారు.అయితే మంగళవారం(ఏప్రిల్-30,2019) ప్రతిపక్ష నాయకుడు జువాన్ గ్యాయిడో చేసిన మిలటరీ తిరుగుబాటు కుట్రను తిప్పికొట్టినట్లు మంగళవారం(ఏప్రిల్-30,2019) వెనుజ్వేలా అధ్యక్షుడు నికోలస్ మాడురో ప్రకటించారు.
తనపై సైనిక తిరుగుబాటు చేయడంలో గ్వాయిడో విఫలమయ్యారని దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో మాడురో తెలిపారు.ఆందోళనకారుల చర్యలు తీవ్రమైన నేరాలని,వారికి శిక్షలు తప్పవని మాడురో తెలిపారు.తనకు వ్యతిరేకంగా అమెరికా కుట్రలు పన్నుతోందన్నారు.తాను వెనుజ్వేలాను వదిలి క్యూబాకు పారిపోయేందుకు సిద్దమయ్యానంటూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపెయో చేసిన వ్యాఖ్యలను మాడురో ఖండించారు.
Also Read : ఇదేనా గుర్తింపు : స్టేడియం ఎదుట పండ్లు అమ్ముతున్న తైక్వాండో అంతర్జాతీయ క్రీడాకారిణి
అమెరికా సహా పలు దేశాల మద్దతు తనకే ఉందని,వెనుజ్వేలా సైన్యం కూడా తనకే సహకరిస్తుదందని మాడురోని గద్దే దించేందుకు అందరూ రోడ్లపై పైకి వచ్చి నిరసనలు చేయాలని ప్రతిపక్ష నాయకుడు మంగళవారం ఇచ్చిన పిలుపుతో వేలాదిమంది ఆయన మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్లొన్నారు.అయితే ఆందోళనకారులపై సైన్యం కన్నెర్ర చేసింది.అధ్యక్షడు మాడురోకి మద్దతుగానే సైన్యం నిలిచింది.నిరసనకారులు రాళ్లు రువ్వగా, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో భద్రతా బలగాలు వారిని చెదరగొట్టాయి.సాయుధ బలగాలకు,ప్రతిపక్ష నేత మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 100మందికి పైగా గాయపడ్డారు.కొన్ని చోట్ల ఆందోళకారులపై సైన్యం వాహనాలు కూడా ఎక్కించింది.
బుధవారం కూడా వీధుల్లోకి రావాలని గ్వాయిడో తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.ఇప్పటివరకు వెనెజ్వేలా రాజకీయ సంక్షోభంలో తాజా పరిణామాలు అత్యంత తీవ్రమైనవి.వెనుజ్వేలాలో శాంతిని నెలకొల్పేందుకు ఇరువర్గాలు సంయనం పాటించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ విజ్ఞప్తి చేశారు.
ఈ ఏడాది జనవరి నుంచి అధ్యక్షుడు మడూరో, ప్రతిపక్ష నేత గ్వాయిడోల మధ్య అధికార పోరు నడుస్తోంది.దేశ అధ్యక్షుడిని తానేనంటూ గ్వాయిడో జనవరి 23న ప్రకటించుకున్నారు.అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా గ్వాయిడోను వెనెజ్వేలా అధ్యక్షుడిగా గుర్తించారు. ఆ తరువాత 20కి పైగా దేశాలు గ్వాయిడోకు మద్దతు ప్రకటించాయి.రష్యా, చైనా, మెక్సికో, టర్కీ వంటి ఇతర శక్తిమంతమైన దేశాలు బాహాటంగా మడూరోను సమర్థిస్తున్నట్లు ప్రకటించాయి.
Also Read : SBI కొత్త రూల్ : సేవింగ్స్ ఖాతాలో నిల్వలపై వడ్డీ తగ్గింపు