Mulayam Singh Yadav : ములాయం సింగ్ యాదవ్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స!

సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ గురువారం (జూలై 1) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురుగ్రామ్‌లోని మెదంత ఆస్పత్రిలో ఆయన చేరినట్టు సమాచారం.

Samajwadi Party Patriarch Mulayam Singh Yadav Hospitalised

Mulayam Singh Yadav Hospitalised : సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ గురువారం (జూలై 1) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురుగ్రామ్‌లోని మెదంత ఆస్పత్రిలో ఆయన చేరినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఆస్పత్రి నుంచి ఎలాంటి అధికారిక హెల్త్ బులెటిన్ వెలువడలేదు.

కానీ, 81ఏళ్ల సీనియర్ పొలిటిషియన్ ములాయం సింగ్ వయస్సు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, అందుకే ఆయన ఆస్పత్రిలో చికిత్స కోసం చేరినట్టు ఓ నివేదిక తెలిపింది. ములాయంను ఆస్పత్రిలో చేర్చి అన్ని పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. ములాయం సింగ్ యాద్ సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు. యూపీ సీఎంగా మూడుసార్లు పనిచేశారు.

జూన్ 1, 1996 నుంచి మార్చి 19, 1998 వరకు భారతీయ రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. గత కొన్ని ఏళ్లుగా ములాయం అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. గత ఏడాదిలో కూడా ఆయన మూత్ర సంబంధిత అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ కూడా యూపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాబోయే కొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం రెడీ అవుతున్నారు.