మోడీపై ఆ జవాన్ పోటీ : వారణాశి అభ్యర్థిని మార్చిన ఎస్పీ

మోడీపై ఆ జవాన్ పోటీ : వారణాశి అభ్యర్థిని మార్చిన ఎస్పీ

Updated On : April 29, 2019 / 10:15 AM IST

ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి సమాద్ వాదీ పార్టీ అభ్యర్థిని మార్చింది. వారణాశి స్థానానికి గతంలో షాలిని యాదవ్ ను అభ్యర్థిగా ఎస్పీ ప్రకటించింది.ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.అయితే ఇప్పుడు ఆ స్థానానికి అభ్యర్థిగా తేజ్ బహదూర్ యాదవ్ ని ఎస్పీ సోమవారం(ఏప్రిల్-29,2019)ప్రకటించింది. 

బీఎస్ఎప్ కానిస్టేబుల్ అయిన తేజ్ ప్రతాప్ యాదవ్ గతేడాది సైనికులకు సరఫరా చేసిన ఫుడ్ క్వాలిటీపై వీడియో రిలీజ్ చేసి సర్వీసు నుంచి డిస్మిస్ అయిన విషయం తెలిసిందే.వారణాశి నుంచి బీజేపీ అభ్యర్థిగా మరోసారి ప్రధానమంత్రి మోడీ పోటీ చేస్తున్న విసయం తెలిసిందే.ఇక ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని మొదట్లో వార్తలు వినిపించినా చివరకు మరోసారి అజయ్ రాయ్ నే అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.