Subramanian Swamy: ఉదయనిధి స్టాలిన్‌పై సుబ్రహ్మణ్య స్వామి ఆగ్రహం.. 

తమిళనాడు గవర్నర్‌కు ఓ లేఖ పంపాను. బంధుప్రీతి వల్ల మంత్రి అయిన స్టాలిన్ బేటా(ఉదయనిధి స్టాలిన్)పై చర్యలు తీసుకోవాలని కోరాను.

Subramanian Swamy

Subramanian Swamy – Udhayanidhi Stalin: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఇటీవల తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు.

‘ తమిళనాడు గవర్నర్‌కు ఓ లేఖ పంపాను. బంధుప్రీతి వల్ల మంత్రి అయిన స్టాలిన్ బేటా(ఉదయనిధి స్టాలిన్)పై విచారణ జరిపించాలని కోరాను. మరోసారి సనాతన ధర్మం గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే.. తమిళనాడు ప్రభుత్వాన్ని కూల్చేయడం కోసం నేను పనిచేస్తాను. ఇండియా అంటే రాష్ట్రాల సమాఖ్య కాదు.. రాష్ట్రాల సమాహారం అని నేను 1991లోనే రుజువు చేశాను ’ అని ట్వీట్ చేశారు.

కాగా, సనాతన ధర్మం మలేరియా, డెంగీ వ్యాధుల లాంటిదంటూ, దాన్ని నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. దీనిపై ఉదయనిధి స్టాలిన్ మళ్లీ నిన్న వివరణ ఇస్తూ… ‘ సనాతన ధర్మం గురించి ఇటీవల నేను మాట్లాడాను. మొన్న నేను చెప్పింది మళ్లీ మళ్లీ చెబుతూనే ఉంటాను. నేను హిందువులనే కాదు.. అన్ని మతాలనూ ఉద్దేశించి అన్నాను. కులం పేరిట ఉన్న భేదాలను ఖండిస్తూ మాట్లాడాను ’ అని చెప్పారు.

Nara Lokesh : రాళ్ల దాడి, వాహనాలు ధ్వంసం.. లోకేశ్ యువగళం పాదయాత్రలో మరోసారి హైటెన్షన్