కాగ్ కొత్త చీఫ్ గా తెలుగు ఐఏఎస్ అధికారి.. ఎవరీ సంజయ్ మూర్తి..

ఆయన స్థానంలో కె సంజయ్ మూర్తి ఈ నెల 21న కాగ్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

CAG New Chief (Photo Credit : Google)

K Sanjay Murthy : భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చీఫ్ గా తెలుగు ఐఏఎస్ అధికారి కె సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న ఆయనను కాగ్ చీఫ్ గా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నియమించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంజయ్ మూర్తి 1989 ఐఏఎస్ బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ కు చెందిన వారు. ప్రస్తుత కాగ్ చీఫ్ గా కొనసాగుతున్న గిరిశ్ చంద్ర ముర్ము పదవీ కాలం ఈ నెల 20తో ముగియనుంది. ఆయన స్థానంలో కె సంజయ్ మూర్తి ఈ నెల 21న కాగ్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న సంజయ్ మూర్తి.. ఉన్నత విద్యకు సంబంధించిన విధానాలను పర్యవేక్షించడం, ప్రభుత్వ కార్యక్రమాల అమలును నిర్ధారించడం, దేశవ్యాప్తంగా విద్యా అభివృద్ధిని ప్రోత్సహించడానికి విద్యా సంస్థలతో సహకరించడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

సంజయ్ మూర్తి హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మూర్తి.. అక్టోబర్ 1, 2021 నుండి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖలో ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. దీనికి ముందు, వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా కీలక పదవులను నిర్వహించారు.

Also Read : శ్రీవాణి ట్రస్ట్ రద్దు, అన్యమత ఉద్యోగులు తొలగింపు.. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు