Sansad TV YouTube : సంసద్ టీవీ అకౌంట్‌‌ను తొలగించిన యూట్యూబ్.. అందుకే టెర్మినేషన్..!

లోక్ సభ, రాజ్యసభ కార్యక్రమాలను ప్రసారం చేసే సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్‌ను యూట్యూబ్ తొలగించింది. ఛానల్ పేజీలో YouTube కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన సంగతి తెలిసిందే.

Sansad TV YouTube : లోక్ సభ, రాజ్యసభ కార్యక్రమాలను ప్రసారం చేసే సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్ (Sansad TV YouTube Channel)ను యూట్యూబ్ తొలగించింది. ఛానల్ పేజీలో “YouTube కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఈ అకౌంట్ మూసివేసినట్టు యూట్యూబ్ తెలిపింది. హ్యాకర్లు సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్‌ను హ్యాకర్లు హ్యాక్ చేసి ఛానెల్ పేరును ‘ఇథీరియమ్(క్రిప్టో కరెన్సీ)’గా మార్చినట్లు ప్రసార భారతి ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. యూట్యూబ్​ యాజమాన్యం వెంటనే సంసద్​ టీవీ అకౌంట్​ను నిలిపివేసింది. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను (YouTube Community Guidelines) అతిక్రమించినందుకే అకౌంట్​ బ్లాక్​ చేసినట్లు స్పష్టం చేసింది. మంగళవారం (ఫిబ్రవరి 15) రాత్రి ఒకటి నుంచి సంసద్ టీవీ యూట్యూబ్ ఛానెల్ సర్వీసులు నిలిచిపోయాయి. సంసద్ టీవీ సోషల్ మీడియా టీమ్ సమస్యను పరిష్కరించి తెల్లవారుజామున 3.45 నిమిషాలకు ఛానల్‌ను రీస్టోర్ చేశారు.

యూట్యూబ్​ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు యూట్యూబ్ అకౌంట్ నిలిపివేసింది. భద్రతా ముప్పును శాశ్వతంగా పరిష్కరించేందుకు ఛానెల్‌ను సాధ్యమైనంత త్వరగా రీస్టోర్ చేస్తామని యూట్యూబ్ వెల్లడించింది. అకౌంట్లో సెక్యూరిటీ ఇష్యూను ఫిక్స్ చేసిన తర్వాత రీస్టోర్ చేస్తామని యూట్యూబ్ తెలిపిందని ప్రసార భారతి ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. ఉదయం 10 గంటల వరకు యూట్యూబ్ సెర్చ్‌లో (Sansad TV YouTube Channel) కనిపించింది. ఆ తర్వాత YouTube’s Community Guidelines ఉల్లంఘించినందున అకౌంట్ టెర్మినేట్ చేసినట్టుగా యూట్యూబ్ మెసేజ్ కనిపించింది. దీనిపై సంస్థ యాజమాన్యం గూగుల్ కు మెయిల్ పంపినా ఫలితం లేకపోయింది. ఇప్పటివరకూ యూట్యూబ్ నుంచి ఎలాంటి స్పందనలేదు.

కొంత సమయం తర్వాత యూట్యూబ్ ఛానెల్ పేజీలో 404 error కనిపించింది. This Page isn’t available. Sorry about that. Try searching for something else అనే మెసేజ్ కనిపించింది. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం.. యూట్యూబ్ ప్లాట్ ఫాంపై ఎలాంటి కంటెంట్‌కు అనుమతి ఉండదంటే.. అన్ని రకాల వీడియోలు, వీడియోలపై వచ్చే కామెంట్స్, లింక్స్, థంబులైన్స్ ఇందులో ఏమైనా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఉంటే వెంటనే యూట్యూబ్ ఆయా ఛానళ్లను రద్దు చేస్తుంది. పార్లమెంట్ ఉభయ సభలైన లోక్ సభ, రాజ్యసభల రెండు టీవీ ఛానెళ్లను కలిపి సంసద్ టీవీని ఏర్పాటు చేసింది. 2021 సెప్టెంబర్ 15న ఈ టీవీ ప్రారంభం కాగా అప్పటినుంచి లోక్ సభ, రాజ్యసభకు సంబంధించిన పలు కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్ ఛానెల్‌ను తీసుకొచ్చింది.

‘పార్లమెంట్ టీవీ’గా నామకరణం :
రాజ్యసభ టీవీ, లోక్‌సభ టీవీలను విలీనం చేయడం ద్వారా పార్లమెంట్ టీవీని ఏర్పాటు చేశారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీలను విలీనం చేసి ‘పార్లమెంట్ టీవీ’గా నామకరణం చేసింది. రిటైర్డ్ IAS రవి కపూర్ మార్చి 2021లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమితులయ్యారు. పార్లమెంట్ టీవీని సెప్టెంబర్ 15, 2021న వైస్ ప్రెసిడెంట్ ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో వెంకయ్యనాయుడు ప్రారంభించారు. యూట్యూబ్‌లోని రాజ్యసభ టీవీ అకౌంట్‌ను కూడా పార్లమెంట్ టీవీగా మార్చారు. ఆ అకౌంట్‌నే ఇప్పుడు యూట్యూబ్ తొలగించింది.


పార్లమెంట్ టీవీ యూట్యూబ్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ పేర్కొంటూ కొంతమంది యూజర్లు సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్‌లు, వీడియోలను పోస్ట్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించలేదు. చాలా మంది వినియోగదారులు స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ అకౌంట్‌ను అర్థరాత్రి హ్యాక్ చేసి ‘ఎథెరియం’గా మార్చారని తెలిపారు. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వీడియో కూడా లైవ్ అని ఉందని పోస్టులు పెట్టారు. చివరి వీడియో సోమవారం రాత్రి 10.35 గంటలకు పార్లమెంట్ టీవీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ అయింది. అది YouTubeకి లింక్‌ను అయి ఉంది. సంసద్ టీవీ( Sansad TV) నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్‌డేట్‌లు లేవంటూ పోస్టులు పెట్టారు.

Read Also :  YouTube Channels: 35 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసిన మోదీ ప్రభుత్వం

ట్రెండింగ్ వార్తలు