SBI Alert : ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక, జూన్ 30లోపు ఆ పని చేయండి

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను మరోసారి అలర్ట్ చేసింది. పాన్ కార్డును ఆధార్ తో వెంటనే లింక్ చేసుకోవాలంది. ఇందుకోసం జూన్‌ 30 వరకు గడువు ఇచ్చింది. లింక్‌ చేయని వారు ఈ నెలాఖరులోగా తప్పకుండా

SBI Customers Alert : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను మరోసారి అలర్ట్ చేసింది. పాన్ కార్డును ఆధార్ తో వెంటనే లింక్ చేసుకోవాలంది. ఇందుకోసం జూన్‌ 30 వరకు గడువు ఇచ్చింది. లింక్‌ చేయని వారు ఈ నెలాఖరులోగా తప్పకుండా చేసుకోవాలని కోరింది. ఒక వేళ లింక్‌ చేయకపోతే పాన్‌ కార్డు చెల్లుబాటు కాదని తేల్చి చెప్పింది. ఆదాయపు పన్ను చట్టం రూల్స్ ప్రకారం.. రూ.1000 జరిమానా పడుతుందని ఎస్బీఐ తెలిపింది. అంతేకాదు నిరంతరాయంగా బ్యాంకింగ్‌ సేవలు పొందేందుకు ఈ పని పూర్తి చేయాలని ఎస్బీఐ కోరింది.

ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా సులభంగానే పాన్, ఆధార్ లింక్ చేసుకోవచ్చు. లేదంటే UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి పాన్ నెంబర్ ఎంటర్ చేసి 567678 లేదా 56161 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపిస్తే సరిపోతుంది.

కాగా, ఇప్పటికే పాన్-ఆధార్ అనుసంధానంపై ఎస్బీఐ అనేక హెచ్చరికలు చేస్తూ గడువు పొడిగిస్తూ వస్తోంది. మే నెలాఖరు వరకు ఉండే గడువు జూన్‌ నెలాఖరు వరకు పొడిగించింది. మరోసారి ట్విట్టర్ వేదికగా తన బ్యాంకు కస్టమర్లను అలర్ట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు