కీలక ప్రకటన చేసిన ఎస్‌బీఐ బ్యాంక్

  • Publish Date - August 23, 2019 / 03:16 PM IST

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. నెలలో వరుసగా రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించినట్లు ఎస్‌బీఐ ప్రకటనలో తెలిపింది. ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.5శాతం తగ్గిస్తున్నట్లు బ్యాంకు స్పష్టం చేసింది.

టర్మ్ డిపాజిట్ రేట్లపై తగ్గించిన వడ్డీ రేట్లు ఆగస్టు 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చెప్పింది. రిటైల్ టర్మ్ డిపాజిట్ల రేట్లను 10నుంచి 50 బేసిస్ పాయింట్లు, బల్క్ టర్మ్ డిపాజిట్ రేట్లను 30నుంచి 70 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు బ్యాంక్ ప్రకటనలో తెలిపింది. 7రోజుల నుంచి 45 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గించింది.

తగ్గించిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి తీసుకుని రానున్నట్లు స్టేట్ బ్యాంకు ప్రకటనలో వెల్లడించింది. 46నుంచి 179 రోజులు, 180 రోజుల నుంచి సంవత్సరం వరకు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లను తగ్గించినట్లు ప్రకటించింది.