Bike Triple Riding: మేము అధికారంలోకి వస్తే “బైక్ పై ట్రిపుల్ రైడింగ్”కు అనుమతిస్తాం: ఓపీ రాజ్‌భర్

70 సీట్లు ఉన్న రైల్లో 300 మంది ఎక్కుతున్నారు, ఆ రైళ్లకు చలాన్ విధించడం లేదు. మరి ఒక బైక్ పై ముగ్గురు ప్రయాణిస్తే చలాన్ ఎందుకు వేస్తున్నారని" ప్రశ్నించారు

Bike Triple Riding: ఎన్నికల సమయంలో.. పార్టీలు, నేతలు ప్రజలకు వరాలు ప్రకటించడం మన దేశంలో సర్వసాధారణం. వాటిలో కొన్ని ఆచరణాత్మకంగా ఉండేవయితే..మరికొన్ని ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు నేతలు చెప్పే అనాలోచిత ప్రకటనలు. తాము అధికారంలోకి వస్తే ఒకే ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణిస్తే చలానా విదించబోమని..అవసరమైతే ట్రిపుల్ రైడింగ్ కు చట్టబద్ధత కల్పిస్తామని ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ సీనియర్ నేత ప్రకటించడం సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నడుస్తుంది. ప్రజలను ఆకర్శించేందుకు నేతలు ప్రచారాల్లో మునిగితేలుతున్నారు. ఈక్రమంలో సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ వింత ప్రకటన చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎస్పీ పార్టీతో పొత్తుపెట్టుకున్న తాము.. అధికారంలోకి వస్తే బైక్ పై ట్రిపుల్ రైడింగ్ కు చట్టబద్ధత కల్పిస్తామని రాజ్‌భర్ ప్రకటించాడు.

Also read: AP PRC ISSUE: ఉపాధ్యాయ సంఘాలపై మండిపడ్డ జేఏసీ చైర్మన్లు

ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ పార్టీ అయిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP).. గతంలో బీజేపీతో కలిసి పొత్తుపెట్టుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో కలిసి బరిలో నిలిచింది. SBSP పార్టీ అధినేత రాజ్‌భర్ బుధవారం ఏఎన్ఐ ప్రతినిధితో మాట్లాడుతూ.. “70 సీట్లు ఉన్న రైల్లో 300 మంది ఎక్కుతున్నారు, ఆ రైళ్లకు చలాన్ విధించడం లేదు. మరి ఒక బైక్ పై ముగ్గురు ప్రయాణిస్తే చలాన్ ఎందుకు వేస్తున్నారని” ప్రశ్నించారు. “మేము అధికారంలోకి వస్తే బైక్ పై ముగ్గురు ప్రయాణికులు ప్రయాణించినా చలాన్ విదించబోమని.. అవసరమైతే దానికి చట్టబద్ధత కల్పిస్తామని” రాజ్‌భర్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది. అంతే కాదు..”ఏదైనా కేసు విషయంలో నేరస్తుడిని స్టేషన్ కు తరలించే సమయంలో.. ఇద్దరు కానిస్టేబుళ్లు సైతం నేరస్తుడితో కలిసి ఒకే బైక్ పై ప్రయాణిస్తున్నారని అది నేరం కాదా? వారికి చలాన్ వేయరా?” అని రాజ్‌భర్ ప్రశ్నించాడు.

Also read: Covid Variant: ఇకపై వచ్చే కరోనా వేరియంట్ లలో వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది: WHO

కాగా రాజ్‌భర్ చేసిన వ్యాఖ్యలు మోటార్ వాహన చట్టాన్ని పక్కదారి పట్టించేలా ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, అంతకన్నా ఎక్కువమంది ప్రయాణిస్తే వాహనం అదుపుతప్పి ప్రయాణికుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆర్టీఓ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజల రక్షణ కోసమే చట్టాలను చేసుకుంటామని వాటిని గౌరవించని పక్షంలో చట్టాలకు విలువ ఉండదని ఆర్టీఓ అధికారులు పేర్కొన్నారు.

Also read: Vijayasai Reddy: ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నచందంగా కేంద్ర బడ్జెట్

ట్రెండింగ్ వార్తలు