AP PRC ISSUE: ఉపాధ్యాయ సంఘాలపై మండిపడ్డ జేఏసీ చైర్మన్లు

పీఆర్సీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించగా, ఉద్యోగసంఘాల జేఏసీ సభ్యులు ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

AP PRC ISSUE: ఉపాధ్యాయ సంఘాలపై మండిపడ్డ జేఏసీ చైర్మన్లు

Prc Issu

AP PRC ISSUE: ఏపీలో పీఆర్సీ రగడ కొత్త మలుపు తీసుకుంది. నిన్నటిదాకా కలిసి పోరాడిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు నేడు ఎడమొహం పెడమొహం వేసుకున్నారు. ఇరువర్గాల మధ్య ఏర్పడ్డ మనస్పర్థలు..దూషణలదాకా వెళ్ళింది. పీఆర్సీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించగా, ఉద్యోగసంఘాల జేఏసీ సభ్యులు ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీరింగ్ కమిటీ సభ్యులు వెంకటరామిరెడ్డి, సూర్యనారాయణ, బొప్పరాజు, బండి శ్రీనివాస్, బుధవారం అమరావతిలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Also read: Covid Variant: ఇకపై వచ్చే కరోనా వేరియంట్ లలో వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది: WHO

ఈసందర్భంగా జేఏసీ సభ్యుడు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. జివోలు విడుదల చేసిన తరువాత ఉద్యోగుల ఆరోపణలను ప్రభుత్వం గుర్తించిందని, చర్చలలో సానుకూలంగా నిర్ణయాలు తీసుకుని తెలంగాణతో సమానంగా ఫిట్మెంట్ తెచ్చుకోగలిగామని అన్నారు. అయితే ఫిట్మెంట్ విషయంలో ఉపాధ్యాయసంఘాల అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదని వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. చర్చల అనంతరం జరిగిన ప్రెస్ మీట్ సమయంలో.. ఉపాధ్యాయ సంఘాల నేతలు ఫోన్లు రాగానే వెళ్లిపోయారని.. వారిని ఎవరో ప్రభావితం చేశారని వెంకటరామిరెడ్డి అన్నారు. మరో సభ్యుడు సూర్యనారాయణ మాట్లాడుతూ నేరుగా ఉద్యోగులతో సంబంధం లేనివారు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మ్దనిపడ్డారు. పౌర సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు ఇలా ప్రవర్థించడం వారి విజ్ఞతకే వదలివేస్తున్నామని సూర్యనారాయణ అన్నారు. గొప్ప పిఆర్సీ తెచ్చామని తాము చెప్పలేదని..గొప్ప పిఆర్సీ ఇచ్చామని ప్రభుత్వం కూడా చెప్పలేదని.. మంచి ఫలితాలు మాత్రమే తెచ్చామని చెబుతున్నట్లు సూర్యనారాయణ తెలిపారు.

Also read: Vijayasai Reddy: ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నచందంగా కేంద్ర బడ్జెట్

ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ కాకుండా చూడమని ప్రభుత్వాన్ని కోరగా.. ఆర్థిక పరిస్థితుల వల్ల ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పిందని సూర్యనారాయణ అన్నారు. హైదరాబాద్ నుంచి వచినందువల్ల అప్పటి సీఎం చంద్రబాబు 30 శాతం హెచ్ఆర్ఏ ఇచ్చారని, వెలగపూడి ఏమైనా హైదరాబాద్ అంత జనాభా వుందా? 30 శాతం హెచ్ఆర్ఏ ఎలా ఇస్తారంటూ సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ చంద్రబాబు ఇవ్వలేదని అప్పట్లో తాను అన్న మాటలకు కట్టుబడి వున్ననన్నా సూర్యనారాయణ.. చట్టపరంగా మాత్రమే చంద్రబాబు ఇచ్చారని తెలిపారు. ఫిట్మెంట్ విషయంలో తాము కూడా కొంత అసంతృప్తిగా ఉన్నామని..అయితే అన్ని ఉద్యోగ సంఘాలు కలవడం వలనే కొంత ప్రయోజనం కలిగిందన్న భావనా ఉద్యోగుల్లోనూ ఉందని సూర్యనారాయణ వివరించారు. సోషల్ మీడియాలో తమపై, తమ కుటుంబాలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడం సరికాదని జేఏసీ సభ్యుడు బండి శ్రీనివాస్ అన్నారు.

Also read: FabiSpray : కరోనాకు చెక్.. ఇండియా ఫస్ట్ నాజల్‌ స్ప్రే వ్యాక్సిన్‌ వచ్చేసింది.. 99శాతం సేఫ్..!