FabiSpray : కరోనాకు చెక్.. ఇండియా ఫస్ట్ నాజల్‌ స్ప్రే వ్యాక్సిన్‌ వచ్చేసింది.. 99శాతం సేఫ్..!

ముంబైకి చెందిన ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్‌ కంపెనీ (Glenmark Pharmaceuticals Ltd) నైట్రిక్‌ ఆక్సైడ్ నాసల్‌ స్ప్రే (Nitric Oxide Nasal Spray)ను డెవలప్ చేసింది.

FabiSpray : కరోనాకు చెక్.. ఇండియా ఫస్ట్ నాజల్‌ స్ప్రే వ్యాక్సిన్‌ వచ్చేసింది.. 99శాతం సేఫ్..!

Fabispray India's First Nas

FabiSpray Nitric Oxide Nasal Spray : ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడుస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు చేపట్టాయి. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సినేషన్ వేగవంతం చేశాయి. ఇప్పటికే చాలా దేశాల్లో కరోనా అదుపులోకి వచ్చింది. భారతదేశంలో కూడా గత కొద్దిరోజులుగా కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా చెక్ పెట్టేందుకు మరో కొత్త కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అది కూడా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్.. ప్రస్తుత వ్యాక్సిన్ల మాదిరిగా టీకా కాదు.. నాజల్ స్ప్రే వ్యాక్సిన్.. ముక్కు ద్వారా ఈ వ్యాక్సిన్ అందిస్తారు.

ముంబైకి చెందిన ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్‌ కంపెనీ (Glenmark Pharmaceuticals Ltd) నైట్రిక్‌ ఆక్సైడ్ నాసల్‌ స్ప్రే (Nitric Oxide Nasal Spray)ను డెవలప్ చేసింది. కెనడాకు చెందిన సానోటైజ్‌ (SaNOtize) కంపెనీ భాగస్వామ్యంతో ‘ఫ్యాబిస్ప్రే’ (FabiSpray) పేరుతో నాజల్ స్ప్రే వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నాజల్ స్ప్రే వ్యాక్సిన్ ప్రత్యేకించి పెద్దవయస్సు వారిలో కరోనా ట్రీట్ మెంట్ కోసం తయారుచేశారు. అయితే ఇప్పటికే ఈ నాజల్ స్ప్రే వ్యాక్సిన్‌కు భారత డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (India’s drug regulator, Drugs Controller General of India) స్ప్రే వ్యాక్సిన్ ఉత్పత్తి, మార్కెటింగ్‌‌కు DCGI అనుమతి ఇచ్చింది. ఈ డ్రగ్ కంపెనీ భారత్‌లో ఫేజ్‌-3 ట్రయల్స్‌ నిర్వహించింది. 24 గంటల్లో 94శాతం వైరల్ తగ్గించగా.. 48 గంటల్లో 99శాతం వైరల్‌ లోడ్‌ను తగ్గించిందని కంపెనీ వెల్లడించింది.

ఎగువ శ్వాస నాళాల్లో వైరస్‌ను అంతం చేయగలదు :
నైట్రిక్‌ ఆక్సైడ్‌ నాసల్‌ స్ప్రే (NONS) చాలా సురక్షితమైందని, కరోనాను దీటుగా ఎదుర్కోగలదని తెలిపింది. FabiSpray ఎగువ శ్వాస నాళాల్లోనే కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు రూపొందించినట్టు పేర్కొంది. ముక్కు ద్వారా అందించే ఈ వ్యాక్సిన్‌ను స్ప్రే చేసినప్పుడు వైరస్‌ను ఊపిరితిత్తుల వరకు చేరకుండా నిరోధిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. FabiSpray Nasal Spray వ్యాక్సిన్ కరోనాపై సమర్థవంతంగా పనిచేస్తుందని, అలాగే ఈ స్ప్రే కూడా చాలా సురక్షితమైందని గ్లెన్‌మార్క్‌ ఫార్మా స్యూటికల్స్‌ లిమిటెడ్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ రాబర్ట్‌ క్రోకార్ట్‌ (Robert Crockart) వెల్లడించారు.

ఊపిరితిత్తులకు వైరస్ సోకకుండా అడ్డుకోగలదు :
కరోనా కట్టడికి భారత్‌ పోరాటంలో తమ కంపెనీ అంతర్భాగంగా ఉండడం చాలా ముఖ్యమన్నారు. నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే (FabiSpray) అనుమతి పొందడంతో పాటు SaNOtize కంపెనీ భాగస్వామ్యంతో టీకా రూపొందించడం ఆనందంగా ఉందని చెప్పారు. FabiSpray స్ప్రే వ్యాక్సిన్.. ప్రత్యేకించి ఎగువ శ్వాసనాళాలలో కరోనా వైరస్‌ను చంపడానికి రూపొందించారు. నాసికా శ్లేష్మం మీద స్ప్రే చేసినప్పుడు NONS ఫిజికల్, కెమికల్ అవరోధంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులకు వైరస్ వ్యాపించకుండా ఈ స్ప్రే వ్యాక్సిన్ నిరోధిస్తుందని తెలిపారు.

నాజల్ స్ప్రే వ్యాక్సిన్ సమర్థవంతమైన సురక్షితమైన యాంటీవైరల్ చికిత్సగా కంపెనీ పేర్కొంది. Utah స్టేట్ యూనివర్శిటీ అమెరికాలో నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. NONS ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఎప్సిలాన్ వేరియంట్‌లతో సహా SARS-Cov-2 వైరస్‌లో 99.9 శాతం 2 నిమిషాల్లో చంపేస్తుందని రుజువైందని తెలిపాయి. నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే వైరల్ లోడ్‌ను తగ్గిస్తుందని సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మోనికా టాండన్‌ తెలిపారు.

Read Also : AP Comity on Tollywood: టాలీవుడ్ సమస్యలపై ప్రభుత్వ కమిటీ రిపోర్ట్ సిద్ధం!