Bharat Jodo Yatra: రాహుల్ గాంధీకి షాకిచ్చిన మరో యూపీ నేత

భారతీయ జనతా పార్టీ మాజీ మిత్రపక్షమైన ఎస్బీఎస్పీ.. పాత మిత్రుత్వం వల్లే జోడో యాత్రకు దూరంగా ఉన్నారా అని ప్రశ్నించగా.. రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు, శాశ్వత శత్రువులు ఉండరని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ.. బీహార్‌లో నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్.. కాశ్మీర్‌లో బీజేపీ, పీడీపీల మధ్య పొత్తు ఉంటుందని ఎవరైనా ఊహించారా అని ఆయన అన్నారు

Bharat Jodo Yatra: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రాహుల్ గాంధీకి వరుస షాక్‭లు ఎదురవుతున్నాయి. భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా రాష్ట్రంలో బలమైన పార్టీలైన బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి, సమాజ్‭వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‭లకు ఆహ్వానించగా వారు ఈ యాత్రకు హాజరు కామని తేల్చి చెప్పారు. ఈ తరుణంలో ఇదే రాష్ట్రానికి మరో నేత కూడా ఇదే సమాధానం చెప్పారు. సుహేల్‭దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‭భర్ సైతం భారత్ జోడో యాత్రలో పాల్గొనమని అన్నారు. తనకు రాహుల్ నుంచి ఆహ్వానం అందిందని, అయితే తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Uttarakhand: హల్ద్వానీలో గూడు కోల్పోనున్న 4,000 కుటుంబాలు.. ఎందుకో తెలుసా?

భారతీయ జనతా పార్టీ మాజీ మిత్రపక్షమైన ఎస్బీఎస్పీ.. పాత మిత్రుత్వం వల్లే జోడో యాత్రకు దూరంగా ఉన్నారా అని ప్రశ్నించగా.. రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు, శాశ్వత శత్రువులు ఉండరని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ.. బీహార్‌లో నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్.. కాశ్మీర్‌లో బీజేపీ, పీడీపీల మధ్య పొత్తు ఉంటుందని ఎవరైనా ఊహించారా అని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చాలా బలమైన స్థితిలో ఉందని, నరేంద్ర మోదీని ఓడించే శక్తి ఏ పార్టీకి లేదని ఆయన అన్నారు.

Karnataka : ప్రధాని మోడీ ముందు సీఎం బసవరాజ్ బొమ్మై కుక్కపిల్లలా వణుకుతారు : సిద్ధరామయ్య

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై రాజ్‌భర్ మాట్లాడుతూ “జనసమూహం పరంగా ఇది విజయవంతమైంది. అయితే ప్రేక్షకులను ఓట్లుగా మార్చడం పెద్ద సవాలు” అని అన్నారు. అయితే ప్రస్తుతం మైనారిటీ వర్గాలపై ప్రభుత్వం ధ్వేషపూరితంగా వ్యవహరిస్తోందన్న వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ “దేశంలో కాంగ్రెస్ చాలా కాలం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలపై కాంగ్రెస్ ఎందుకు ప్రేమను చాటలేదు? గతంలో కాంగ్రెస్‌లో ఉన్నవారే నేడు బిజెపిలో ఉన్నారు” అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు