Uttarakhand: హల్ద్వానీలో గూడు కోల్పోనున్న 4,000 కుటుంబాలు.. ఎందుకో తెలుసా?

నిరసన తెలిపిన నివాసితులకు ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. వారు 70 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని, మసీదు, దేవాలయం, ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌, పీహెచ్‌సీ, 1970లో వేసిన మురుగు కాలువ, రెండు ఇంటర్‌ కళాశాలలు, ప్రాథమిక పాఠశాల ఉన్నాయని.. ఇప్పుడివన్నీ పోతాయని కాంగ్రెస్‌ కార్యదర్శి ఖాజీ నిజాముద్దీన్‌ అన్నారు

Uttarakhand: హల్ద్వానీలో గూడు కోల్పోనున్న 4,000 కుటుంబాలు.. ఎందుకో తెలుసా?

4,000 families in Uttarakhand's Haldwani may soon be homeless

Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్ద్వానీలోని బన్‌భూల్‌పురాలో నివాసం ఉంటున్న సుమారు 4,000 పైగా కుటుంబాలు నివాసాన్ని కోల్పోనున్నాయి. కారణం, వారు నివసించే ప్రాంతం రైల్వేకు చెందినది కావడం. ఈ విషయమై రాష్ట్ర హైకోర్టు నోటీసులు పంపింది. దీంతో నిలువ నీడ లేకుండా పోతుందని హల్ద్వానీ ప్రాంతవాసులు ఆందోళనకు దిగారు. వారం రోజుల క్రితమే వీరికి నోటీసులు అందాయి. అప్పటి నుంచి చలిలోనే నిరసనకు దిగారు. హల్ద్వానీ రైల్వే స్టేషన్ సమీపంలోని కాలనీల్లో నివిసిస్తున్న ఇందులో ఎక్కువ మంది ముస్లింలు. దీంతో స్థానిక బీజేపీ ప్రభుత్వం ఏవేవో బూచీలు చూపించి వారిని ఉద్దేశ పూర్వకంగానే అక్కడి ఖాళీ చేయిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధురాలిపట్ల ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన.. సిబ్బంది ఏం చేశారంటే..

డిసెంబర్ 20న రైల్వే భూమిలో ఉన్న ఆక్రమణదారులకు ఉత్తరాఖండ్ హైకోర్టు నోటీసు ఇచ్చింది. వారం రోజుల్లో భూమిని ఖాళీ చేయించాలని రైల్వే, స్థానిక అధికారులను ఆదేశించింది. ఆక్రమణదారులు భూమిని ఖాళీ చేయకపోతే, పోలీసులు, పారామిలటరీ బలగాలతో సహా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. హల్ద్వానీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సుమిత్ హృదయేష్ నేతృత్వంలో ఆ ప్రాంత వాసులు హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జనవరి 5న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జమాతే ఇస్లామీ హింద్ ఒక ప్రకటన ప్రకారం, వివాదాస్పద స్థలం 29 ఎకరాలు కాగా, 78 ఎకరాల భూమిలో నివసిస్తున్న ప్రజలకు రైల్వే తొలగింపు నోటీసులు అందాయి. హైకోర్టు ఆదేశాలతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న 50,000 మందికి పైగా ప్రజలు నివాసం కోల్పోతున్నట్లు వారు పేర్కొన్నారు.

MLC Kavitha: కొడుకు చేసిన ప్రాజెక్ట్ వర్క్ చూసి మురిసిపోయిన ఎమ్మెల్సీ కవిత.. ఫొటోలు వైరల్

నిరసన తెలిపిన నివాసితులకు ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. వారు 70 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని, మసీదు, దేవాలయం, ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌, పీహెచ్‌సీ, 1970లో వేసిన మురుగు కాలువ, రెండు ఇంటర్‌ కళాశాలలు, ప్రాథమిక పాఠశాల ఉన్నాయని.. ఇప్పుడివన్నీ పోతాయని కాంగ్రెస్‌ కార్యదర్శి ఖాజీ నిజాముద్దీన్‌ అన్నారు. ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఆక్రమణల తొలగింపును ఆపాలని ప్రధాని, రైల్వే మంత్రిత్వ శాఖ, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు నిజాముద్దీన్ తెలిపారు. ప్రభుత్వ చర్యను ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ఏరియాలో మూడు ప్రభుత్వ ఇంటర్ కాలేజీలు ఉండగా అది ఆక్రమణ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.