మందిరమా-మసీదా : రెండు నెలల్లో తేల్చాలని కమిటీ ఏర్పాటు

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా,సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులు కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీకి

  • Published By: venkaiahnaidu ,Published On : March 8, 2019 / 05:42 AM IST
మందిరమా-మసీదా : రెండు నెలల్లో తేల్చాలని కమిటీ ఏర్పాటు

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా,సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులు కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీకి

వివాదాస్పద అయోధ్య రామ జన్మభూమి,బాబ్రీ మసీదు ల్యాండ్ కేసును శాశ్వత పరిష్కారం కోసం కోర్టు సమక్షంలో మధ్యవర్తిత్వానికి అప్పగించాలని శుక్రవారం(మార్చి-8,2019) సుప్రీంకోర్టు నిర్ణయించింది. మధ్యవర్తిత్వ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నప్పటికీ వాటిని పక్కనబెట్టిన ధర్మాసనం ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా,సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులు ఈ కమిటీలో ఉన్నారు.
Also Read : వైఎస్సార్ సీపీకి అధ్యక్షుడు కేసీఆరే : సీఎం చంద్రబాబు

ఈ కమిటీకి చైర్ పర్శన్ గా జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా వ్యవహరించనున్నారు.నాలుగు వారాల్లోగా మధ్యవర్తిత్వ కమిటీ స్టేటస్ రిపోర్ట్ పూర్తి అవ్వాలని,ఎనిమిది వారాల్లోగా మధ్యవర్తిత్వ ప్రొసీడింగ్స్ పూర్తి అవ్వాలని సుప్రీం ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లోనే ఈ కమిటీ ప్రొసీడింగ్స్ అన్నీ జరగాలని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనికి అనుగుణంగా అవసరమైన ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.మధ్యవర్తిత్వ ప్రొసీడింగ్స్ అన్నీ కాన్ఫిడెన్షియల్ గా కెమెరా సమక్షంలోనే జరగాలని కోర్టు సూచించింది.

ఈ కేసు కేవలం ఆస్తి తగాదా మాత్రమే కాదని..రెండు మతాలకు, విశ్వాసాలకు సంబంధించిన విషయమని,మొఘల్ రాజ్ బాబర్ ఏం చేశారు, ఆ తర్వాత ఏం జరిగిందనే దానితో తమకు సంబంధం లేదనీ… ఇప్పుడు ఏం జరుగుతుందన్న దానిపైనే తాము దృష్టిపెట్టగలమని సమస్య పరిష్కారానికి ఎక్కువ మంది మధ్యవర్తులు అవసరమని తాము భావిస్తున్నట్లు ఈ కేసు విచారణ సందర్భంగా బుధవారం(మార్చి-6,2019) సుప్రీం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Also Read : నిగ్గుతేల్చాలంటూ హైకోర్టు ఆదేశం : వివాహేతర సంబంధాలకు కారణం టీవీ సీరియల్స్, సినిమాలేనా?