రాఫెల్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం

  • Published By: venkaiahnaidu ,Published On : March 14, 2019 / 11:59 AM IST
రాఫెల్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం

రాఫెల్ కేసులో తీర్పుని రిజర్వ్ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం నిర్ణయం తీసుకుంది.రాఫెల్ కేసులో 2018 డిసెంబర్-14న కేంద్రప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇస్తూ సుప్రీం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం తీర్పుపై మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి,సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ సుప్రీంలో రివ్యూ పిటిషనన్లు దాఖలు చేశారు. రాఫెల్ డీల్ లో అవకతవకలు జరిగాయని పత్ర్యేక దర్యాప్తు బృందంతో ఈ ఒప్పందంపై విచారణ జరిపించాలని వారు కోరారు. ఈ రోజు రివ్యూ పిటిషన్ల పై సుప్రీంకోర్టులో(మార్చి-14,2019) వాదనలు ముగిశాయి.

సుప్రీంలో వాదనల సందర్భంగా రాఫెల్ ఒప్పందంపై కోర్టుకి అందించిన కాగ్ నివేదికలో పొరపాటు జరిగిందని ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకి తెలిపారు. కేంద్రం దాఖలు చేసిన నివేదికలో మొదటి మూడు పేజీలు లేవని వాటిని రికార్డుల్లో చేర్జేందుకు అనుమతి ఇవ్వాలని వేణుగోపాల్ కోరారు. లీకైన రాఫెల్ పత్రాలను పిటిషన్ల నుంచి తొలగించాలని కోరారు. దేశ భద్రత దృష్ట్యా గోప్యత పాటించాల్సిన డాక్యుమెంట్లుగా వాటిని పరిగణించాలని కోరారు.

రివ్యూ పిటిషన్లను కొట్ివేయాలని కోరారు.అటార్నీ జనరల్ వ్యాఖ్యలపై పిటిషనర్ ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాఫెల్ డీల్ కు సంబంధించిన పత్రాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ప్రశాంత్ భూషన్ అన్నారు. అంతగోప్యత పాటించాల్సిన పత్రాలు లీకైనప్పుడు కేంద్రం ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. సుదీర్ఘంగా గంటపాటు వాదనలు జరిగిన తర్వాత తీర్పుని రిజర్వ్ చేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది.