Vaccines Purchase History: వ్యాక్సిన్ కొనుగోలుపై పూర్తి డేటా కేంద్రం సమర్పించాలి – సుప్రీం

కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలుకు సంబంధించిన పూర్తి డేటాను సుప్రీం కోర్టుకు సబ్ మిట్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. కొవీషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ లాంటి వ్యాక్సిన్ల అన్నింటి సమాచారం ఇవ్వాలని తెలియజేసింది.

Vaccines Purchase History: కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలుకు సంబంధించిన పూర్తి డేటాను సుప్రీం కోర్టుకు సబ్ మిట్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. కొవీషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ లాంటి వ్యాక్సిన్ల అన్నింటి సమాచారం ఇవ్వాలని తెలియజేసింది. ముగ్గురు జడ్జిల బెంజ్ DY Chandrachud, L Nageswara Rao, S Ravindra Bhatలు మూడు వ్యాక్సిన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఒక్కో తేదీలో ఎన్ని వ్యాక్సిన్ల క్వాంటిటీ ఆర్డర్ పెట్టారు. ఎప్పటిలోగా ఇవ్వాలని అడిగారో.. కూడా తెలియజేయాలని కోరింది.

దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఫైల్ నోటింగ్స్ అన్నింటినీ కేంద్రం సమర్పించాలని అగ్ర ధర్మాసనం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం మిగిలిన జనాభాకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లలో వ్యాక్సిన్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. డిసెంబర్ చివరి నాటికి జనాభా అందరికీ వ్యాక్సిన్ ఇప్పించగలమని కేంద్రం హామీ ఇచ్చింది.

అంతేకాకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి ప్రస్తుత జూన్ నెలలో 12కోట్ల డోసులు అందుకుంటాయని పేర్కొన్నాయి.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్మార్) డైరక్టర్ జనరల్ బలరాం భార్గవ మాట్లాడుతూ.. సంవత్సరం చివరి కల్లా దేశం మొత్తానికి వ్యాక్సినేషన్ చేయగలమని ధీమా వ్యక్తం చేశారు. రోజుకు కావాల్సిన ఒక కోటి డోస్ వ్యాక్సిన్లను జులై మధ్యలో లేదా ఆగష్టు కల్లా రెడీ చేస్తామని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు