WATCH : అవసరమా ఇలాంటి రైడ్స్‌..?ఒళ్లు జలదరించే వీడియో

ఇది వరకు బైక్ వేసుకొని కొన్ని ప్రదేశాల‌ను చుట్టి రావడం ఓ సరదా. అయితే ప్రస్తుత రోజుల్లో వాళ్లు చూసిన ప్రాంతాలను వీడియోలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం ఓ పిచ్చి.

Viral

Mountain Road : ఇది వరకు బైక్ వేసుకొని కొన్ని ప్రదేశాల‌ను చుట్టి రావడం ఓ సరదా. అయితే ప్రస్తుత రోజుల్లో వాళ్లు చూసిన ప్రాంతాలను వీడియోలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం ఓ పిచ్చి. అయితే బైకు ప్రయాణం అంటే మజాతో పాటు కాస్త ప్రమాదం కూడా దాగుంటుంది. మరీ కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్‌ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ మాత్రం వాహనదారుడు అప్రమత్తంగా లేకపోయినా గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. తాజాగా ఓ బైకర్‌ మృత్యువు అంచులవరకు వెళ్లి వచ్చిన వీడియో వైరల్‌గా మారింది.

Read More : Team India : టీమ్ ఇండియాలో RRR, రోహిత్‌‌కు తొలి పరీక్ష

శ్రీనగర్, లడఖ్‌కు మధ్య మార్గం జోజిలా పాస్‌లో పర్వతాల గుండా ఇద్దరు యువకులు బైకుపై వెళుతున్నారు. అయితే ఆ బైకర్ల కంటే ముందు ఇనుప పైపులతో నిండిన ట్రక్కు వెళ్తోంది. ఇంతలో ఓ బైకర్‌ ఆ ట్రక్కును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నించబోయాడు. అప్పటికే ఆ రోడ్డు మొత్తం బుర‌ద బుర‌ద‌గా ఉండ‌టం.. ట్రక్ ద‌గ్గరికి వెళ్లగానే బైక్ స్కిడ్ అయ్యి ప‌క్కనే ఉన్న లోయలో పడబోయాడు. అదృష్టవశాత్తు అతను బైకుని కంట్రోల్‌ చేసి కాలు కింద పెట్టి అంతెత్తు పర్వతం నుంచి పడే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియోను అతని వెనుకే ఉన్న మరో బైక్ రైడర్ రికార్డ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అలాంటి రైడ్స్‌ చేసేటప్పుడు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.