Mann Ki Baath : మన్ కీ బాత్ వినలేదని విద్యార్థులకు జరిమానా
నిరసిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థుల హక్కుల జాతీయ సంఘం అధ్యక్షుడు ఆరిఫ్ ఖాన్ డెహ్రాడూన్ ముఖ్య విద్యాధికారికి లేఖ రాశారు. పాఠశాల యాజమాన్యం స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో విద్యార్థులకు నోటీసు పంపిందని స్క్రీన్ షాట్లను ఆధారంగా చూపారు.

Mann Ki Baath
Mann Ki Baath : ప్రధానమంత్రి మన్ కీ బాత్ వినలేదని డెహ్రాడూన్ లో స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు జరిమానా విధించింది. గత నెల ఏప్రిల్ 30వ తేదీన ప్రసారమైన ప్రధానమంత్రి మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ వినలేదని డెహ్రాడూన్ లోని ఓ స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు రూ.100 జరిమానా విధించింది.
దీన్ని నిరసిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థుల హక్కుల జాతీయ సంఘం అధ్యక్షుడు ఆరిఫ్ ఖాన్ డెహ్రాడూన్ ముఖ్య విద్యాధికారికి లేఖ రాశారు. పాఠశాల యాజమాన్యం స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో విద్యార్థులకు నోటీసు పంపిందని స్క్రీన్ షాట్లను ఆధారంగా చూపారు.
మన్ కీ బాత్ వినడానికి స్కూల్ కు హాజరు కాని విద్యార్థులు రూ.100 జరిమానా చెల్లించాలని లేదా మెడికల్ సర్టిఫికేట్ సమర్పించాలని నోటీస్ లో పేర్కొంది. స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆరిఫ్ ఖాన్ డిమాండ్ చేశారు. దీనిపై శుక్రవారం ముఖ్య విద్యాధికారి స్పందించారు.
ఈ ఘటనపై జీఆర్డీ నిరంజనాపూర్ అకాడమీ ఆఫ్ డెహ్రాడూన్ కు షోకాజ్ నోటీసు జారీ చేశామని తెలిపారు. మూడు రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వకపోతే విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేసినట్లుగా భావించి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.