Covid wave: కరోనా సెకండ్ వేవ్ ముగియలేదు, మూడో వేవ్ ఎప్పుడొస్తుంది? ఎందుకు?

కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గడంతో మూడో వేవ్ అంచనాలు కూడా ప్రారంభమైంది.

Second Covid wave: కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గడంతో మూడో వేవ్ అంచనాలు కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మూడో వేవ్ అంచనాలపై మాట్లాడుతూ, కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని, చివరి దశలో ఉందని, మూడవ వేవ్ మాత్రం కోవిడ్-19 విషయంలో ప్రజలు ప్రవర్తించే తీరు, అప్రమత్తతపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు.

భారతదేశానికి 75 సంవత్సరాల స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ కింద CISF నిర్వహించిన రక్తదాన శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో, డాక్టర్ గులేరియా మాట్లాడుతూ, ప్రజలు కోవిడ్ -19 విషయంలో జాగ్రత్తలు పాటించినప్పుడు, మూడవ వేవ్ కేసులు తగ్గుతాయని, భారతదేశంలో సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని ప్రజలు అర్థం చేసుకోవాలని గులేరియా అన్నారు. రోజువారీ కరోనా కేసుల సంఖ్య 40,000 కంటే ఎక్కువ అవుతోంది. ప్రతి ఒక్కరూ కరోనా నియమాలను పాటించడం ముఖ్యం. నియమాలను పాటిస్తే, దేశంలో మూడో వేవ్‌ను ముందు ఆపేయవచ్చు.

కోవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభమైంది, సెకండ్ వేవ్ సమయంలో కరోనావైరస్ కేసులు నాలుగు లక్షలు దాటాయి. అయితే, ‘జూన్’లో కేసులు తగ్గడం ప్రారంభమయ్యాక కొంతమంది నిపుణులు ఆగస్టు-సెప్టెంబర్‌లలో మూడో వేవ్ గురించి హెచ్చరించారు. కాన్పూర్ మరియు హైదరాబాద్ IITలు ఆగస్టు మధ్యలో మరొక వ్యాప్తి లేదా కోవిడ్-19 మూడవ వేవ్‌ని అంచనా వేశాయి, ఇది వైరస్ రకాన్ని బట్టి అక్టోబర్‌లో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని పేర్కొన్నాయి.

ట్రెండింగ్ వార్తలు