Assembly elections : నేడు పశ్చిమ బెంగాల్‌, అసోంలో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు

మరికాసెపట్లో పశ్చిమ బెంగాల్‌, అసోంలో 2వ విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభంకానున్నాయ్‌. పశ్చిమ బెంగాల్‌లో 30, అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Assembly Elections

Assembly elections in West Bengal and Assam : మరికాసెపట్లో పశ్చిమ బెంగాల్‌, అసోంలో 2వ విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభంకానున్నాయి‌. పశ్చిమ బెంగాల్‌లో 30, అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్‌లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతోంది. బెంగాల్‌లో 76లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నాయి. అసోంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అసోంలో 73 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బెంగాల్‌లో ఎన్నికలు జరిగే 4 జిల్లాల్లో 800 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించాయి. 4 జిల్లాల్లోని పోలింగ్‌ కేంద్రాలు సున్నితమైనవిగా ఈసీ ప్రకటించింది.

బెంగాల్ లోని 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో ఉత్కంఠ పోరుకు తెరలేపిన నందిగ్రామ్‌ అసెంబ్లీ స్థానానికి కూడా ఎన్నికలు జరగుతున్నాయి‌. అయితే, ఈ సమస్యాత్మక ప్రాంతంలో అల్లర్లు చెలరేగే ఆస్కారం ఉండటంతో.. ఎన్నికల కమిషన్‌ అక్కడ నిషేధాజ్ఞలు జారీ చేసింది. నందిగ్రామ్‌ వ్యాప్తంగా నిన్నటి నుంచే 144 సెక్షన్‌ అమలవుతోంది. రేపటి వరకూ ఆదేశాలు కొనసాగుతాయి. పోలింగ్‌ పూర్తయ్యే వరకు ఏ వ్యక్తినీ నియోజకవర్గంలోకి అనుమతించేది లేదని తెలిపారు అధికారులు.

నందిగ్రామ్‌ నియోజకవర్గ వ్యాప్తంగా నలుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడరాదని ఈసీ ఆదేశించింది. మరోవైపు హెలికాప్టర్లతో నిఘా పెంచినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్‌ కోసం ఈ ప్రాంతంలో 22 కంపెనీల కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. రాష్ట్ర పోలీసులు కూడా భారీగా భద్రతను పెంచారు. నియోజకవర్గానికి వచ్చే అన్ని వాహనాలను అధికారులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. బయటి వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించట్లేదు.