Uttarpradesh : మాస్క్ ధరించలేదని కస్టమర్‌పై కాల్పులు
మాస్క్ ధరించే విషయంలో ఓ బ్యాంకులో వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన సెక్యూర్టీ గార్డు కాల్పులకు దిగడంతో కస్టమర్ కి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

No Mask bank
Security Guard Shoots : ఎందుకు మాస్క్ ధరించలేదని ప్రశ్నించడం కారణంగా..వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకనొక దశలో ఘర్షణలు, బాహాబాహికి దిగుతున్నారు. తాజాగా..మాస్క్ ధరించే విషయంలో ఓ బ్యాంకులో వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన సెక్యూర్టీ గార్డు కాల్పులకు దిగడంతో కస్టమర్ కి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బరేలి జిల్లాలోని బ్యాంకు ఆఫ్ బరోడా బ్యాంకు ( Bank of Baroda) ఉంది. ఈ బ్యాంకులోకి ఓ కస్టమర్ తన భార్యతో కలిసి వచ్చాడు.
మాస్క్ ధరించకపోవడంతో అక్కడనే ఉన్న సెక్యూర్టీ గార్డు మాస్క్ పెట్టుకోవాలని సూచించాడు. లేకపోతే బ్యాంకులోకి అనుమతించేది లేదని ఖరాఖండిగా చెప్పాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం ముదరడంతో సెక్యూర్టీ గార్డు అమాంతం ఆ కస్టమర్ పై ఓ రౌండ్ కాల్పులకు దిగబడ్డాడు. ప్రమాదవశాత్తు కస్టమర్ తొడలోకి దూసుకెళ్లడంతో కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న భర్తను చూసి భార్యా షాక్ కు గురైంది. ఎందుకు కాల్పులు జరిపావు అంటూ అరిచింది. గాయాలపాలైన అతడిని ఆసుపత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆ సెక్యూర్టీ గార్డును అదుపులోకి తీసుకున్నారు. దుర్భాషలాడడంతో అప్పటికే లోడ్ అయి ఉన్న గన్ ట్రిగ్గర్ దగ్గర అనుకోకుండా ప్రెస్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని సెక్యూర్టీ గార్డ్ వెల్లడించాడు. తనను కూడా కొట్టడంతో చొక్కా గుండీలు తెగిపోయాయని, తాను గాయపడ్డానని పోలీసులకు తెలిపాడు. అయితే..ఉద్ధేశ్యపూర్వకంగానే కాల్పులు చేశాడని గాయపడిన బంధువు వెల్లడించారు. ప్రస్తుతం సెక్యూర్టీ గార్డును ప్రశ్నిస్తున్నట్లు Bareilly Police Chief Rohit Singh Sajwan తెలిపారు.