Third Covid Dose : కరోనా మూడో డోస్..వృద్ధులకు డాక్టర్ సర్టిఫికేట్, ప్రిస్కిప్షన్ అవసరం లేదు

పిల్లలు, వృద్ధులకు అదనపు డోస్ వ్యాక్సినేషన్ పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులతో ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సమీక్ష జరిపారు...

Senior Citizens Covid Dose : కొద్ది రోజుల్లో భారతదేశంలో కరోనా మూడో డోస్ పంపిణీకి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దేశంలో 15 -18 సంవత్సరాల వయస్సున్న వారికి జనవరి మూడో తేదీ నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఇటీవలే ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…2021, డిసెంబర్ 28వ తేదీ మంగళవారం పిల్లలు, వృద్ధులకు ఇచ్చే వ్యాక్సినేషన్ పై కేంద్రం సమీక్ష జరిపింది. 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, వృద్ధులకు అదనపు డోస్ వ్యాక్సినేషన్ పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులతో ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సమీక్ష జరిపారు.

Read More : Prakash Javadekar : ఏపీలో బెయిల్ పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకెళతారు: ప్రకాశ్ జవదేకర్

సమీక్ష అనంతరం వ్యాక్సినేషన్ పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులకు రాజేష్ భూషణ్ లేఖ రాశారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ భారత్ లో జరుగుతోందని, దేశంలో 142 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు వెల్లడించారు. 90 శాతం మంది ప్రజలు ఒక డోస్, 62 శాతం మంది ప్రజలు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారన్నారు. 2022, జనవరి 3 నుంచి 15-18 సంవత్సరాల వయస్సు గల వారికి కోవాగ్జిన్ టీకాలు, జనవరి 10 నుండి హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏళ్ల పైబడి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ముందస్తు జాగ్రత్తగా కోవిడ్ టీకాలు అందజేయాలన్నారు. వృద్ధుల అనారోగ్యాన్ని నిర్ణయించడానికి డాక్టర్ సర్టిఫికేట్/ప్రిస్క్రిప్షన్ అవసరం లేదని స్పష్టం చేశారు.

Read More : ATM Cash Withdrawal : జనవరి 1 నుంచి న్యూ రూల్స్.. ఏటీఎం నగదు విత్‌డ్రా కొత్త ఛార్జీలు ఇవే..!

కోవిడ్ డోస్ తీసుకునే 60 ఏళ్ల పైబడిన వారు వైద్యులను సంప్రదించి వ్యాక్సిన్ తీసుకోవచ్చని ప్రజలకు సూచించారు. రెండో డోస్ తీసుకున్న 9 నెలల తరువాత మూడో డోస్ తీసుకోవాలని లేఖలో వెల్లడించారు. వాక్-ఇన్, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా 15-18 సంవత్సరాల వారికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని సూచించారు. కోవిన్ రిజిస్ట్రేషన్‌లు జనవరి 1 నుంచి ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్, జనవరి 3 నుంచి ప్రారంభమవుతాయని మరోసారి గుర్తు చేశారు. 15-18 సంవత్సరాల వయస్సు గల వారికి ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఇందుకు ప్రత్యేక టీకా బృందాలు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఇక త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆయా రాష్ట్రాల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అందువల్ల, వ్యాక్సినేషన్‌ను పెంచడానికి వచ్చే వారం రోజులు చాలా కీలకమని తెలిపింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు తమ జిల్లాల వారీగా వ్యాక్సినేషన్ అమలును తప్పనిసరిగా సమీక్షించాల్సి ఉంటుందని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు