ATM Cash Withdrawal : జనవరి 1 నుంచి న్యూ రూల్స్.. ఏటీఎం నగదు విత్‌డ్రా కొత్త ఛార్జీలు ఇవే..!

బ్యాంకు అకౌంట్ దారులకు అలర్ట్.. వచ్చే ఏడాది 2022 జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఏటీఎంలో నగదు విత్‌డ్రాపై కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి.

ATM Cash Withdrawal : జనవరి 1 నుంచి న్యూ రూల్స్.. ఏటీఎం నగదు విత్‌డ్రా కొత్త ఛార్జీలు ఇవే..!

Atm Cash Withdrawal Rules To Change From 1 January 2022 Free Withdrawal Limit, New Charges Here

ATM Cash withdrawal : బ్యాంకు అకౌంట్ దారులకు అలర్ట్.. వచ్చే ఏడాది 2022 జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఏటీఎంలో నగదు విత్‌డ్రాపై కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి. గతంలో ఏటీఎంల్లో నుంచి నగదు ఉపసంహరణకు చెల్లించిన మొత్తం కంటే అధిక మొత్తంలో బ్యాంకు అకౌంట్ దారులు చెల్లించాల్సి ఉంటుంది.

ఫ్రీ విత్ డ్రా లిమిట్ దాటిన వెంటనే ఈ కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బ్యాంకులు తమ కస్టమర్‌లకు పెరిగిన ఛార్జీల నోటిఫికేషన్‌లను పంపిస్తున్నాయి. జనవరి 1, 2022 నుంచి ఈ కొత్త చార్జీలు అమలులోకి రానున్నాయని, ATM లావాదేవీల ఛార్జీలు ఉచిత పరిమితిని మించి రూ. 20+ ట్యాక్స్ నుంచి రూ. 21+ ట్యాక్స్ కు సవరించింది.

ఇప్పటికే HDFC బ్యాంక్ తమ వెబ్‌సైట్‌లో నోటీసును ప్రకటించింది. జనవరి 1, 2022 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. Axis బ్యాంక్ లేదా ఇతర బ్యాంక్ ATM లలో ఉచిత పరిమితి కంటే ఎక్కువ ఆర్థిక లావాదేవీలపై రూ. 21 + GST వర్తించనుందని Axis బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఉచిత నెలవారీ పరిమితి దాటిన తర్వాత నగదు, నగదు రహిత ATM లావాదేవీలపై ఛార్జీలను పెంచేందుకు బ్యాంకులకు అనుమతించింది. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం.. జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఏడాది నుంచి ఏటీఎంల్లో విత్ డ్రా చేసే ముందు కొత్త చార్జీల వివరాలు ఎలా ఉండనున్నాయో ఓసారి చూద్దాం..

1) RBI నోటిఫికేషన్ ప్రకారం.. కస్టమర్‌లు నగదును ఉపసంహరించుకోవడానికి గతంలో చెల్లించిన దానికంటే రూ. 1 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

2) జనవరి 1, 2022 నుంచి కస్టమర్‌లు నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితిని దాటితే.. ప్రతి లావాదేవీకి రూ. 20కి బదులుగా రూ. 21 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులకు అధిక ఇంటర్‌చేంజ్ చార్జీలను అందించేందుకు ఖర్చుల సాధారణ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని.. ప్రతి లావాదేవీపై కస్టమర్ నుంచి ఛార్జీలను రూ. 21కి పెంచేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతినిచ్చింది. ఈ కొత్త చార్జీలు జనవరి 1, 2022 నుండి అమల్లోకి వస్తాయని RBI ప్రకటనలో వెల్లడించింది.

3) డెబిట్ కార్డ్‌లను కలిగిన అన్ని బ్యాంక్ కస్టమర్‌లు నెలకు వారి అకౌంట్ బ్రాంచ్ ATMలలో ఉచితంగా 5 వరకు లావాదేవీలకు అనుమతి ఉంటుంది. అందులో నగదు లేదా నగదు రహిత లావాదేవీలు చేసుకునేందుకు అర్హులుగా ఆర్బీఐ పేర్కొంది.

4) మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల నుంచి 3 ఉచిత లావాదేవీలు, నాన్-మెట్రో నగరాల్లో 5 ఉచిత లావాదేవీలకు అనుమతి ఉంటుంది.

5) ఉచిత నెలవారీ పరిమితులకు మించి నగదు, నగదు రహిత ATMలపై ఛార్జీలను పెంచడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) బ్యాంకులను అనుమతించింది.

Read Also : Traffic Challan On Bike : ఒకే బైక్‌పై 139 చలానాలు..రూ.54,195 జరిమానా