Covid Vaccine: ఆ ఏజ్ గ్రూప్‌కు కూడా కొవిడ్ వ్యాక్సిన్.. క్లియరెన్స్ పొందిన సీరం

ఇండియాలోనే తొలి mRNA కొవిడ్ వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మంగళవారం అప్రూవల్ దక్కించుకుంది. జెనోవా బయోఫార్మాసూటికల్స్ 18ఏళ్లు అంతకంటే పైబడ్డ వారికి ఎమర్జెన్సీ యూజ్ కోసం ఆమోదించినట్లుగానూ అధికారులు వెల్లడించారు.

 

 

Covid Vaccine: ఇండియాలోనే తొలి mRNA కొవిడ్ వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మంగళవారం అప్రూవల్ దక్కించుకుంది. జెనోవా బయోఫార్మాసూటికల్స్ 18ఏళ్లు అంతకంటే పైబడ్డ వారికి ఎమర్జెన్సీ యూజ్ కోసం ఆమోదించినట్లుగానూ అధికారులు చెప్తున్నారు. ఇతర mRNA వ్యాక్సిన్లను సున్నా డిగ్రీల టెంపరేచర్ వద్ద ఉంచితే, కొవావ్యాక్స్ మాత్రం 2-8 డిగ్రీల మధ్య ఉంచాల్సి ఉంటుంది.

ఈ పరిస్థితుల మధ్య సీరమ్ ఇన్ స్టిట్యూట్ తయారుచేసిన కొవిడ్ వ్యాక్సిన్ కొవావ్యాక్స్ ను 7 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్కులు వాడేందుకు వీలుగా రూపొందించారు.

COVID-19 సబ్జెక్ట్ నిపుణుల కమిటీ గత వారం 7 నుండి 11 సంవత్సరాల వయస్సు గలవారికి Covovax, 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న Gennova రెండు డోస్ m-RNA వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగానికి అప్రూవల్ ఇచ్చింది. ఆ సిఫార్సు చేసిన తర్వాత DCGI ఆమోదం తెలిపిందని అధికారిక వర్గాలు అన్నారు.

Read Also: జంతువులకు కూడా కొవిడ్ వ్యాక్సిన్..ఇండియాలో తొలిసారి

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వం, నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ మార్చి 16న ఈ విషయమై DCGIకి ఒక దరఖాస్తు సమర్పించారు. నిపుణుల ప్యానెల్, ఏప్రిల్‌లో జరిగిన చివరి సమావేశంలో, దరఖాస్తుపై పూణేకి చెందిన సంస్థ నుండి మరింత డేటాను కోరింది.

DCGI డిసెంబరు 28న పెద్దవారిలో 12 నుండి 17 సంవత్సరాల వయస్సు గలవారిలో కొన్ని షరతులకు లోబడి మార్చి 9న అత్యవసర పరిస్థితుల్లో పరిమితం చేయబడిన ఉపయోగం కోసం Covovaxని ఆమోదించింది.

ట్రెండింగ్ వార్తలు