Kishtwar Road accident: జమ్మూకశ్మీర్ కిష్త్వార్‌లోని డ్యామ్ వద్ద ప్రమాదం.. ఏడుగురు మృతి

వాహనం 300 అడుగుల లోతైన లోయలోకి పల్టీలుకొట్టుకుంటూ పడిపోయింది. దీంతో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో పదిమందికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం కిష్త్వార్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్ లోని కిష్త్వార్‌లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. దుందురు పవర్ ప్రాజెక్ట్ ఉద్యోగులు ప్రయాణిస్తున్న క్రూయిజ్ కారు ప్రమాదానికి గురికావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులంతా కూలీలు. వాహనంలో ప్రయాణిస్తున్న మరికొందరికి గాయాలయ్యాయి. బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో దుందురు గ్రామంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

Jammu Kashmir Houses Cracks : బాబోయ్.. జమ్ముకశ్మీర్‌లోనూ డేంజర్ బెల్స్, జోషిమఠ్ తరహాలో ఇళ్లకు పగుళ్లు, అసలేం జరుగుతోంది?

వాహనం 300 అడుగుల లోతైన లోయలోకి పల్టీలుకొట్టుకుంటూ పడిపోయింది. దీంతో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో పదిమందికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం కిష్త్వార్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జేకే06-3095 రిజిస్ట్రేషన్ గల వాహనం స్థానిక కూలీలందరినీ దచన్ నుండి నిర్మాణంలో ఉన్న ఆనకట్ట ప్రాంతానికి తీసుకెళ్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతులు సుదేష్ కుమార్, అఖ్తర్ హుస్సేన్, అబ్దుల్ రషీద్, ముబ్షర్ అహ్మద్, ఇత్వ, రాహుల్, కరణ్ లుగా అధికారులు గుర్తించారు.

Road Accident: నాగ్‌పూర్-పూణే హైవేపై ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. ఏడుగురు మృతి

ఈ ప్రమాదం పై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. దుందురు డ్యామ్ వద్ద జరిగిన దురదృష్టకరర రోడ్డు ప్రమాదం గురించి కిష్వ్తార్ డాక్టర్ దేవాన్ష్ యాదవ్ తో మాట్లాడాను. ఏడుగురు మృతిచెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. గాయపడిన వారిని అవసరాన్ని బట్టి జిల్లా ఆసుపత్రి క్విష్వ్తార్, జీఎంసీ దోడాకు తరలించారు. క్షతగాత్రులందరికీ మెరుగైన చికిత్స అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు